Banjara Hills Crime: వెంటపడి లవ్ అన్నాడు.. పెళ్లంటే నో అంటున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరిచయం ఎవరితో ఎలా ఏర్పడుతుందో చెప్పలేము. ఇప్పుడున్న యువతలో ఆకర్షనో లేక మరే ఇతర కారణమో ఇద్దరు చూడకుండానే స్నేహం చేయండం.. ప్రేమలో పడటం ఆతరువాత మోసపోవటం. ఇటువంటివి మనం చూస్తుంటాము. సినిమాలో చూస్తున్నట్లు గానే మనం నిజజీవతంలో ఇలాంటి సంఘటనలు చూస్తున్నాము. ఫేస్ బుక్ , ఇన్ స్టా గ్రామ్ లోను ఇలా కారణాలు ఏవైనా సరే.. పరిచయం కాస్తా స్నేహం, ప్రేమ, ఆతరువాత మోసం వరకు దారి తీస్తోంది. దీని వల్ల కొందరు మోస పోతున్నారు మరికొందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బంజారాహిల్స్ రోడ్ నెం.2లో నివసించే భాను ప్రకాశ్(21)కి 2020లో ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్యా పరిచయం కుదిరింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. కొద్ది రోజులకే ఆ యువతితో పెళ్లి చేసుకుంటానంటూ చెప్పగా ఆమె అందుకు అంగీకరించలేదు. చాలా రోజులుగా ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఆమె చివరకు అంగీకరించింది. 2020 నవంబర్ 11న భాను ప్రకాశ్ బైక్‌పై ఆమె ఇంటికి వెళ్లి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని తన గదికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా ఏడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాది ఫిబ్రవరిలో భాను ప్రకాశ్ మరో యువతితో చాట్ చేస్తున్నాడని గమనించిన బాధిత యువతి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇందుకు నిరాకరించిన సదరు యువకుడు తనకు ఇప్పుడు పెళ్లి అవసరం లేదని, నువ్వు కూడా అవసరం లేదంటూ ముఖం మీద చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మేడ్చల్ పోలీసులు ఈ కేసును జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసి తదుపరి విచారణకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!