NTV Telugu Site icon

Unemployed: నిజామాబాద్‌ కార్పొరేషన్‌ లో నిరుద్యోగులకు గాలం.. జాబ్‌ గ్యారంటీ అంటూ లక్షల్లో వసూలు

Unemployed

Unemployed

Unemployed: నిజామాబాద్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగాలు అంగడి సరుకుగా మారాయి. ఉద్యోగులతో కుమ్మక్కైన దళారుల హల్‌ చల్‌ సృష్టిస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం వేస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల కోసం లక్షల్లో వసూలు అమాయకులకు గాలం వేస్తున్నారు. లక్షా 50వేలు చెల్లిస్తే జాబ్‌ గ్యారంటీ అని మస్కా కొడుతున్నారు. దీంతో నిరుద్యోగులు జాబ్‌ గ్యారంటీ అనడంతో.. వీరి మాయటలను నమ్మిన 9మంది 50వేల చొప్పున అడ్వాన్స్‌ చెల్లించారు. ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి రావడంతో.. రంగంలోకి దిగారు అధికారులు. స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ విచారణకు ఆదేశించింది. గతంలో జరిగిన పారిశుద్ద కార్మికుల నియామాకాల్లోనూ అక్రమాలు జరిగాయని, ఇప్పుడు కంప్యూటర్‌ ఆపరేటర్ల పేర్లతో దండుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. అయితే రంగంలోకి దిగిన మున్సిపల్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతుంది. కవతవకలు జరిగినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని అధికారులు వెల్లడించారు.

Read also: TRS MLA’s Trap Issue: ప్రగతి భవన్‌లోనే ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. కాసేపట్లో కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌..

ఉద్యోగంలేక మంచి భవిష్యత్‌ కోసం ఉద్యోగాలకు కోసం ఎదురుచూస్తున్న అమాయకుల నిరుద్యోగులను ఎరవేస్తున్నా దళారులు. డబ్బు చెల్లిస్తే మంచి ఉద్యోగాలు ఇస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు వీరి మాయమాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగులు ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని చదువుకున్న వారైనా ఇలాంటి వారి చేతులో కీలబొమ్మలై వారి మంచి భవిష్యత్తును నాసనం చేసుకుంటున్నారని, అప్పు చేసి ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
CM Jagan : నేడు నెల్లూరులో సీఎం జగన్‌ పర్యటన