Site icon NTV Telugu

ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. వంద రోజుల్లో 55 కి పైగా కేసులు

Acb

Acb

ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచింది. వంద రోజుల్లో 55 కి పైగా ఏసీబీ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అన్ని శాఖలో అవినీతి అధికారులపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పట్టుబడుతున్న వారిలో పోలీస్, రెవెన్యూ శాఖ టాప్ చేసినట్లు గుర్తించారు. పది రోజుల్లో పలువురు పోలీస్ లు ఏసిబి ట్రాప్ చేశారు. మీర్పేట్ ఎస్సై, మాదాపూర్ ఎస్సై, స్టేషన్ రైటర్, అసిఫాబాద్ ఎస్సై ఏసీబీ ట్రాప్ చేసింది. లంచం తీసుకుంటున్న అధికారుల ఆస్తులను సైతం వెరిఫై చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోను లోతుగా దర్యాప్తు చేపట్టారు.

Read also: Payal Rajput : జిగేల్ డ్రెస్సులో పాయల్ హాట్ ట్రీట్.. ఫ్యాన్స్ ఫిదా..

హెచ్ఎండిఏ శివ బాలకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగజ్యోతి, ములుగు ప్రభుత్వ అధికారి తస్లీమా , తాసిల్దార్ రజిని పై ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు నమోదయ్యాయి. 1064 టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు అందుబాటులో ఉంచాలని చూస్తున్నారు. ఒకే రోజు ముగ్గురు అధికారులను ట్రాప్ చేసినట్లు ఎసిబి వెల్లడించింది. ఒకే రోజు ఎస్సై, DCA అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్టీసీ డిఎం లను ట్రాప్ చేసింది. తెలంగాణలో ప్రతి నాలుగు రోజులకు ఒక ట్రాప్ కేసు నమోదవడం గమనార్హం. వీటితోపాటు గొర్రెల స్కాం, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Madhuri Dixit: 50ప్లస్ లో కూడా మాధురి అందానికి ఫిదా ఆవలిసిందే…

Exit mobile version