Rain Alert: మాండూస్ తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రాష్ట్రంలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గిన.. మెదక్ జిల్లా టెక్క్మాల్ లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా అల్మాయిపేటలో 18.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల వర్షం కురయడంతో.. కల్లాల్లో ధాన్యం తడిసింది, పత్తి పంటపై వానకు తడిసి ముద్దైంది. ఇక కొమురం భీం జిల్లా ఎల్కపల్లె లో 46.5 మీమీ వర్షపాతం నమోదుకాగా.. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి లో 22.8 మీమీ వర్షపాతం. ఆదిలాబాద్ జిల్లాలో 18.8 మీమీ వర్షపాతం నమోదు అయ్యింది.
Read also: RRR in Japan: యాబై రోజుల్లో మూడు దశాబ్దాల రజినీ రికార్డ్ కి ఎండ్ కార్డ్…
తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ మండు తుపాను రైతులను కంటతడి పెట్టిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు గత 20 రోజులుగా ధాన్యాన్ని రోడ్లపై పోసుకుని వాటి విక్రయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయదు, మిల్లర్లు కొనుగోలు చేయరు. ఏం చేయాలో తోచక.. రవాణా ఖర్చులు భరించలేక రోడ్లపైనే ధాన్యం కుప్పలు తెప్పలుగా పోసుకున్న రైతులు ఇప్పుడు మండు తుపానుతో కుప్పలు తెప్పలుగా పోశారు. భారీ వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లపైన, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నెల 15న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Read also: Extramarital Affair: అత్తతో వివాహేతర సంబంధం.. పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..
ఆదివారం గ్రేటర్‌లో తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలు, గాలిలో తేమ 78 శాతంగా నమోదైంది. రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉదయం పూట పొగమంచు కురుస్తుందని, తూర్పు, ఆగ్నేయం నుంచి చలిగాలులు వీస్తాయని చెప్పారు.13న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
Read also: Extramarital Affair: అత్తతో వివాహేతర సంబంధం.. పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..
