NTV Telugu Site icon

Telangana Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో వర్షాలకు ఛాన్స్

Telangana Rains

Telangana Rains

Telangana Rains: ఆంధ్రప్రదేశ్ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలికపాటి తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలో తెలికపాటి నుంచి కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో అక్కడక్క చిరుజల్లులు కురుస్తున్నాయి. బండంపేట్, చంద్రాయణ గుట్ట, మాధాపూర్ పలుచోట్ల వాన జల్లులు కురుస్తుంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకటి రెండు చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశలో గంటకు 8 నుంచి 10 కి.మీ వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ శాతం 79గా నమోదైంది.

కాగా.. పగటి ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదని, రాత్రి కూడా చలి తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతానికి నేటి నుంచి ఈ నెల 26 వరకు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. శ్రీ సత్యసాయి, చిత్తూరు, కృష్ణా, బాపట్ల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పలనాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాలలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతామరాజు తెలిపారు.
Nagulapalli Maanas : ఘనంగా జరిగిన సీరియల్ నటుడు మానస్ వివాహం.. ఫోటోస్ వైరల్..