NTV Telugu Site icon

Telangana Rains: ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

Telangana Rain Alert

Telangana Rain Alert

Telangana Rains: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, ములుగు, కొత్తగూడెం, మేడ్చల్-మల్కాజిగిరిలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పగటిపూట 30 డిగ్రీల సెల్సియస్, రాత్రి 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి జిల్లా యాదాద్రి నారాయణపురం మండలంలో 5.9 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరు మండలంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కూడా వర్షం కురిసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని బాలానగర్, మూసాపేట్ సర్కిల్ పరిధిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొహదీపట్నం, జూబ్లీ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ, అమీర్ పట్టే, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, లఖడికపూల్, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, దొమ్లగూడ, హిమాయత్ నగర్, అశోక్ నగర్, ఎల్‌బీ నగర్, మియాపూర్, సింద్రాబాద్, చిక్కడపల్లి, చిక్కడపల్లి, చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Assembly Election 2023: కాంగ్రెస్ తిరిగి వస్తుందా లేక ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం వస్తుందా? ఆ ఓట్లు ఎవరికీ