Telangana Rains: ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, ములుగు, కొత్తగూడెం, మేడ్చల్-మల్కాజిగిరిలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పగటిపూట 30 డిగ్రీల సెల్సియస్, రాత్రి 22 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భువనగిరి జిల్లా యాదాద్రి నారాయణపురం మండలంలో 5.9 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరు మండలంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, జోగులాంబ గద్వాల, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని కొన్ని మండలాల్లో కూడా వర్షం కురిసింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని బాలానగర్, మూసాపేట్ సర్కిల్ పరిధిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొహదీపట్నం, జూబ్లీ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ, అమీర్ పట్టే, పంజాగుట్ట, ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, లఖడికపూల్, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, దొమ్లగూడ, హిమాయత్ నగర్, అశోక్ నగర్, ఎల్‌బీ నగర్, మియాపూర్, సింద్రాబాద్, చిక్కడపల్లి, చిక్కడపల్లి, చోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Assembly Election 2023: కాంగ్రెస్ తిరిగి వస్తుందా లేక ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం వస్తుందా? ఆ ఓట్లు ఎవరికీ
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!