Site icon NTV Telugu

Live: తెలుగు రాష్ట్రాలకు రెడ్‌ అలెర్ట్..

Rainfall

Rainfall

LIVE : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ l Heavy Rains in Telugu States

The liveblog has ended.
  • 09 Jul 2022 10:15 PM (IST)

    నిర్మల్ జిల్లాలో

    నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఖానాపూర్ పట్టణంలోని బుడ్డోని కుంట నిండి ప్రమాదస్థాయికి చేరడంతో తూములు తెరిచి.ఒడ్డును తొలచి నీటిని బయటకు పంపిన నీటిపారుదలశాఖ అధికారులు.

  • 09 Jul 2022 10:05 PM (IST)

    కుంటవాగులో పడి ఇద్దరు గల్లంతు

    నిజామాబాద్ జిల్లాలోని లింగి తాండా సమీపంలో గల నెమలితాండ కుంటవాగులో పడి ఇద్దరు గల్లంతు... లింగి తాండాకు చెందిన నడిపి సాయిలు(45), దారంగుల రెడ్డి(35)గా గుర్తింపు.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, రెవెన్యూ బృందాలు.

  • 09 Jul 2022 09:13 PM (IST)

    హైదరాబాద్‌లో వర్షం ఇలా..

    గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం... అల్వాల్ తిరుమలగిరి బొల్లారం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి జల్లులతో కూడిన వర్షం. కాప్రా, ఏ.ఎస్.రావు నగర్, హెచ్.బి.కాలనీ, చర్లపల్లి, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, కీసరతో కురుస్తున్న మోస్తరు వర్షం.

  • 09 Jul 2022 08:56 PM (IST)

    భారీ వర్షాలు.. కంట్రోల్ రూం ఏర్పాటు..

    ఏలూరు జిల్లా: భారీ వర్షాలు, వరదల నేపథ్యంతో అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్. కలెక్టరేట్ లో 1800 233 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

    కాకినాడ : భారీ వర్షాల నేపథ్యంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. కలెక్టరేట్ లో మూడు షిఫ్ట్ లు పని చేసేలా ఉద్యోగులు తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.

  • 09 Jul 2022 07:47 PM (IST)

    నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీ వరద

    నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీ వరద.. 9 గేట్లు ఎత్తివేత.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

  • 09 Jul 2022 07:34 PM (IST)

    హైదరాబాద్‌లో భారీ వర్షం..

     

    హైదరాబాద్‌లో ఉదయం నుంచి మోస్తారుగా వర్షం కురుస్తూనే ఉంది. అయితే రాత్రి 7 గంటల ప్రాంతాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఇప్పటికే ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయ్యాయి. కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. మరికొన్ని చోట్ల విద్యుత్‌కు తీవ్ర అంతారాయం చోటు చేసుకుంది.

  • 09 Jul 2022 06:42 PM (IST)

    నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష

    భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేసిఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు ఆయా జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉండాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సూచించారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ... సమన్వయంతో పనిచేయాలి. గోదావరి పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజల అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి. అందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలి. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి కంట్రోల్ రూం ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసి, దానిపై విస్తృత అవగాహన కల్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని పనిచేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.

  • 09 Jul 2022 05:27 PM (IST)

    విజయనగరంలో.. చెరువులు కట్టలు తెగి గ్రామాల్లోకి ప్రవహిస్తున్న వరద నీరు

    విజయనగరంలోని తెర్లాం మండలంలో వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న మంగళ గెడ్డ. చెరువులు కట్టలు తెగి గ్రామాల్లోకి ప్రవహిస్తున్న వరద నీరు. తెర్లాం మండలం నందిగాం గ్రామానికి చెందిన లక్ష్మం నాయుడు చెరువుకి గండి. నందిగాం గ్రామంలోకి చేరుకున్న వరద నీరు. వరద నీటిలో చేపలు పడుతున్న గ్రామస్తులు. గ్రామాన్ని సందర్శించిన తహశీల్దార్ రాజేశ్వరరావు. తెర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో రోడ్డుపైకి మంగళ గెడ్డ వరద నీరు. బొబ్బిలి శ్రీకాకుళం వాహన రాకపోకలకు ఆటంకం. రహదారిపై నిలిచిపోయిన వాహనాలు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు..

  • 09 Jul 2022 05:01 PM (IST)

    బాల్కొండ నియోజకవర్గంలో నిలిచిన రాకపోకలు

    ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. బాల్కొండ నియోజకవర్గంలో నిలిచిన రాకపోకలు. భీంగల్ మండలంలో పలుగ్రామాల్లో నిలిచిన రవాణా సౌకర్యాలు. ఉధృతంగా ప్రవహిస్తున్న కప్పలవాగు, జక్లాత్ వాగు. గోనుగొప్పుల వద్ద వాగు ప్రవాహ ధాటికి రోడ్డు కొట్టుకుపోవటంతో 4 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. బజ్జోరా వద్ద జక్లాత్ వాగు పూర్తిగా రోడ్డును ముంచేయటంతో 5 గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. బడా భీంగల్ రూపుల తండా వద్ద వరద నీటికి పూర్తిగా కొట్టుకుపోయిన ఆర్అండ్‌బీ రోడ్డు.

  • 09 Jul 2022 04:50 PM (IST)

    వర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సూచించారు. ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌భావిత‌మైన ప్రాంతాలైన శాస్తి నగర్, శాంతి నగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ నగర్ , బుధవార్ పేట్, హరిజన వాడ, డాక్టర్స్ లేన్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ర్య‌టించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను, నాలాలను పరిశీలించారు.

    ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

  • 09 Jul 2022 04:13 PM (IST)

    భారీ వర్షాలతో తెలంగాణలో రెవెన్యూ సదస్సులు వాయిదా -సీఎం కేసీఆర్‌

     

    భారీ వర్షాలతో తెలంగాణలో రెవెన్యూ సదస్సులు వాయిదా. ఈ నెల 15న తలపెట్టిన రాష్ట్రవ్యాప్త రెవెన్యూ సదస్సుల వాయిదా. వాతావరణం అనుకూలించాక మరో తేదీ ప్రకటిస్తాం.

  • 09 Jul 2022 03:32 PM (IST)

    నిర్మల్‌ జిల్లా భైంసాను ముంచెత్తిన వరద

     

    నిర్మల్‌ జిల్లా భైంసాను ముంచెత్తిన వరద. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌ 6 గేట్లు ఎత్తివేత. జలదిగ్బంధంలో భైంసా పట్టణం. ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో చిక్కుకున్న ఆరుగురు. బోటు ద్వారా రక్షించే ప్రయత్నంలో పోలీసులు.

  • 09 Jul 2022 03:00 PM (IST)

    తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఆరా

    తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్‌కు కేసీఆర్‌ ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ సూచన చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, రెస్య్యూ టీంలను అప్రమత్తం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

  • 09 Jul 2022 02:28 PM (IST)

    ఐఎండీ తాజా వార్నింగ్..

    రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని.. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షంతో పాటు అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. ఇక, ఈరోజు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాగా, ఈ సీజన్‌లో తొలిసారి తెలంగాణలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది ఐఎండీ.. ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండగా.. అత్యతం భారీ వర్షాలు తప్పవన్న వాతావరణశాఖ హెచ్చరికలు టెన్షన్‌ పెడుతున్నాయి.

  • 09 Jul 2022 11:09 AM (IST)

    ఎడతెరిపి లేకుండా వాన..

    హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.. శుక్రవారం రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపోటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా పడుతున్న వానలతో వాగులు, వంకలకు జలకళ వచ్చింది.. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఎగువ ప్రాంతాల నుంచి వరదలు రావడం.. వర్షాలు కూడా కురుస్తుండడంతో.. క్రమంగా నదులు, ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం పెరుగుతోంది.

  • 09 Jul 2022 10:45 AM (IST)

    గోదావరిలో పెరిగిన నీటిమట్టం..

    ఓవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మరోవైపు ఎగువప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో గోదావరి నదిలో క్రమంగా నీటి ఉధృతి పెరుగుతోంది.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగిపోతోంది.. భద్రాచలంలో నీటిమట్టం 20.3 అడుగులకు చేరుకుంది..

  • 09 Jul 2022 09:52 AM (IST)

    ఏపీలోని పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్

    తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడతో పాటు తూర్పుగోదావరి, యానంలో రెడ్‌ అలెర్ట్‌ జారీ అయ్యింది.. ఇవాళ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  • 09 Jul 2022 09:14 AM (IST)

    తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు

    తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.. తెలంగాణలో హైదరాబాద్‌ సహా 14 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఇక, ఏపీలోని పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు అధికారులు.. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

  • 09 Jul 2022 09:10 AM (IST)

    హైదరాబాద్‌కు రెడ్‌ అలెర్ట్..

    హైదరాబాద్‌ సహా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, హైదరాబాద్‌ కు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది ఐఎండీ.. సిటీ సహా 14 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేయడం ఇదే తొలిసారి కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

Exit mobile version