IIT-H ఎయిర్ టాక్సీ వచ్చేసింది.! Hyderabadలో ట్రాఫిక్ కష్టాలకు ఇక ‘టాటా’
- IIT హైదరాబాద్ నుంచి ఎయిర్ టాక్సీ బ్రేక్‌థ్రూ
- ట్రాఫిక్‌కు గుడ్‌బై.. గాలిలో ప్రయాణం
- పైలట్ అవసరం లేని స్మార్ట్ ఎయిర్ టాక్సీ
- ఎమర్జెన్సీ వైద్యంలో గేమ్ చేంజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ప్రయాణం అంటేనే ఒక యుద్ధం. ఆఫీస్‌కు వెళ్లాలన్నా, ఇంటికి రావాలన్నా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్‌లు.. గంటల తరబడి సిగ్నల్ దగ్గర నిరీక్షణ. కానీ, త్వరలోనే మనం ఈ రోడ్లపై పాకాల్సిన అవసరం లేదు.. పక్షుల్లా గాలిలో ఎగురుతూ గమ్యస్థానానికి చేరుకోవచ్చు! అవును, మీరు విన్నది నిజమే. IIT హైదరాబాద్ (IIT-H) పరిశోధకులు పట్టణ ప్రయాణ ముఖచిత్రాన్ని మార్చేసే ఒక అద్భుతమైన ‘ఎయిర్ టాక్సీ’ (Air Taxi) ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు.
Samsung మైండ్ బ్లోయింగ్ లాంచ్..CES 2026లో ‘Galaxy Book6’ సిరీస్..!
Also Read
- Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
- Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
- Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
- Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
ఇది కేవలం ‘టాక్సీ’ కాదు.. భవిష్యత్తు ప్రయాణం.!
సంగారెడ్డి జిల్లా కందిలోని IIT హైదరాబాద్ క్యాంపస్‌లో శనివారం ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఫ్యాకల్టీ సభ్యులు దీపక్ జాన్ మాథ్యూ, ఆయన సహచరుడు కేతన్ చతుర్మత కలిసి రూపొందించిన ఈ సూపర్ ఎయిర్ ట్యాక్సీ భవిష్యత్తులో మన రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపబోతోంది.
ఈ ఎయిర్ టాక్సీ ప్రత్యేకతలు ఏంటి?
- సూపర్ స్పీడ్: ఈ టాక్సీ గంటకు 60 నుండి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. అంటే రోడ్డు మీద గంట పట్టే ప్రయాణం, గాలిలో కేవలం 10-15 నిమిషాల్లోనే పూర్తవుతుంది.
- బరువు మోసే సామర్థ్యం: ఇది దాదాపు 120 కిలోల బరువును (పేలోడ్) సునాయాసంగా మోసుకెళ్లగలదు.
- పైలట్ అవసరం లేదు: ఇది పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థ. ముందుగా ప్రోగ్రామ్ చేసిన నావిగేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రయాణికులు కూర్చుంటే చాలు, మాన్యువల్ సాయం లేకుండానే అది మనల్ని సురక్షితంగా గమ్యానికి చేరుస్తుంది.
ప్రాణాలను కాపాడే ‘ఏంజిల్’
ఈ ఎయిర్ టాక్సీ కేవలం ఆఫీసులకు వెళ్లడానికే కాదు, అత్యవసర వైద్య సేవల్లోనూ విప్లవం తీసుకురానుంది. ముఖ్యంగా అవయవ మార్పిడి (Organ Transplant) సమయంలో మానవ అవయవాలను ఒక ఆసుపత్రి నుండి మరో ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలో చేర్చడానికి ఇది సంజీవనిలా పనిచేస్తుంది. ట్రాఫిక్ వల్ల ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రాణాలు పోయే స్థితిలో, ఈ ఎయిర్ టాక్సీ ‘గ్రీన్ ఛానల్’ కంటే వేగంగా పనిచేస్తుంది.
రోడ్లపై ఎప్పుడు ఎగురుతుంది?
ప్రస్తుతం ఈ ప్రోటోటైప్ పరీక్షల దశలో ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి అనుమతులు రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2026 లేదా 2027 నాటికి ఈ ఎయిర్ టాక్సీలు వాణిజ్యపరంగా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మనం సినిమాల్లో చూసే సైన్స్ ఫిక్షన్ దృశ్యాలు త్వరలోనే హైదరాబాద్ గగనతలంపై నిజం కాబోతున్నాయి. రోడ్లపై హారన్ల గోల, కాలుష్యం నుండి తప్పించుకుని.. హాయిగా గాలిలో ప్రయాణించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్, ముఖ్యంగా మన తెలంగాణ గడ్డపై ఉన్న IIT హైదరాబాద్ సాధించిన ఈ విజయం గర్వించదగ్గ విషయం..
LG మరో మ్యాజిక్..! గోడకు అతుక్కుపోయే Wallpaper TV.. 9mm మందం.. 4 రెట్లు ఎక్కువ బ్రైట్నెస్.!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
SIR Protest: SIR పోరాటంలో కాంగ్రెస్ కొత్త ప్లాన్.. నవంబర్ 5న బెంగళూర్‌లో నిరసన!
-
Pulivendula Election Results: 43 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. పులివెందులలో ఎగిరిన టీడీపీ జెండా..
ట్రెండింగ్
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!