NTV Telugu Site icon

కేంద్రం కొనకపోయినా మేం కొంటాం : మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల ఆధైర్యపడవద్దని కేంద్ర కొనకపోయినా మేం ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. అంతేకాకుండా అధికారులు గతంలోని అనుభవాలతో ముందు సాగాలని సూచించారు.

రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్‌, పంట పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. చివరి ధాన్యపుగింజను కూడా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన వెల్లడించారు.