NTV Telugu Site icon

న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా : ఉత్తమ్‌ కుమార్ రెడ్డి..

congress mp uttam kumar

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పై నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో ఖరీఫ్ పంట కొనుగోళ్లలో, రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులకు మద్ధతు ధర లభించడం లేదని, ప్రభుత్వ తీరు మారకుంటే కాంగ్రెస్ రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

రైతులకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానన్నారు. లక్షల కోట్లు ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు. ఖరీఫ్ పంట కొనుగోలు పై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు, ఇప్పటి వరకు గ్రామాల్లో
కొనుగోలు కేంద్రాలు ఎందుకు తెరవలేదు..? అని ప్రశ్నించారు. రైతుల ధాన్యం ఆమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి చివుడాల్సి వస్తోందని, రబీ పంటలో వరిపై ఆంక్షలు పెట్టొద్దన్నారు. పంట కొనుగోలు పై అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారని, రైతులకు ఇష్టమైన పంట వేసుకునే స్వేచ్ఛ వారికి కల్పించాలన్నారు.

పోడు భూముల విషయంలో అమాయక గిరిజనులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. అంతేకాకుండా ‘వరి పంట వేయొద్దనడానికి మీరెవరు. ధనిక రాష్ట్రంలో ప్రతి గింజ కొంటామన్న ప్రభుత్వం ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు. తక్షణమే ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. టోకెన్ల పంపిణీలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి వేచిచూడాల్సి వస్తుంది’ అని ఆయన వెల్లడించారు.