Site icon NTV Telugu

Manchireddy Kishan Reddy: ఇవాళ మళ్లీ ఈడీ ముందుకు.. బ్యాంకు లావాదేవీలపై ఆరా

Ed

Ed

Manchireddy Kishan Reddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్‌ రెడ్డి నిన్న రెండోరోజు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టర్‌ విచారణకు హాజరయ్యారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డిని 10 గంటలకు పైగా ఈడీ విచారించింది. తెలుగు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేపిన క్యాసినో కేసులో కిషన్ రెడ్డిని విచారిస్తున్నారు. ఇవాళ మూడోరోజుకూడా మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ఈడీ ముందుకు హాజరు కానున్నారు.

మొదటి రోజు 8 గంటలు, రెండో రోజు 10 గంటలపాటు విచారించిన ఈడీ. ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశాలలో లావాదేవీలు జరిపిన దానిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. పది గంటల పాటు విదేశాలలో జరిపిన లావాదేవీలపై ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. విదేశీ టూర్ లో జరిపిన ట్రాన్సక్షన్స్ పై ఈడీ అధికారులకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి డాక్యుమెంట్స్ సమర్పించారు. విదేశీ టూర్లపై ఈడీకి ఎమ్మెల్యే స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఇక, మంచిరెడ్డి కిషన్ రెడ్డి 2014 ఆగస్టులో విదేశాలకు వెళ్లిన ఆయన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో పర్యటించినట్లు తెలిసింది. కాగా, విదేశాలకు వెళ్లే ముందు ఫారెక్స్ కార్డ్ కూడా తీసుకెళ్లినట్లు ఈడీ గుర్తించింది. ఈనేపథ్యంలో.. డబ్బులు అవసరం కావడంతో అమెరికాలోని తన బంధువుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక, మంచిరెడ్డి విదేశాల్లో కేసినో ఆడారని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా డబ్బు బదిలీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Saniya Iyappan: టచ్ చేసిన ఫ్యాన్.. లాగి పెట్టి కొట్టిన హీరోయిన్

Exit mobile version