iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- బ్యాంక్ ఖాతాల వినియోగానికి నాంపల్లి కోర్టు అనుమతి
- రూ.3 కోట్ల అన్‌ఫ్రీజ్‌కు న్యాయస్థానం నిరాకరణ
- కుటుంబ పోషణకు ఇబ్బందులంటూ రవి పిటిషన్
- దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iBomma Ravi : పైరసీ సైట్ ఐబొమ్మ (iBomma) వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న రవికి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో స్వల్ప ఊరట లభించింది. గతంలో పోలీసులు సీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాలను రోజువారీ ఆర్థిక లావాదేవీల కోసం తిరిగి ఉపయోగించుకునేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే, అదే సమయంలో ఆయా ఖాతాల్లో ప్రస్తుతం ఫ్రీజ్ అయి ఉన్న రూ. 3 కోట్ల నగదును మాత్రం అన్‌ఫ్రీజ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది.
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని పిటిషన్
పోలీసుల దర్యాప్తులో భాగంగా తన బ్యాంక్ ఖాతాలు పూర్తిగా స్తంభించిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖాతాలన్నీ ఫ్రీజ్ కావడం వల్ల దైనందిన జీవితం గడవడం కష్టంగా మారిందని, తన కుటుంబ పోషణ కూడా భారమైందని పిటిషన్లో పేర్కొన్నారు. అందువల్ల సీజ్ అయిన తన బ్యాంక్ ఖాతాల్లోని రూ. 3 కోట్ల నగదును వెంటనే విడుదల చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
Also Read
ఖాతాల వాడకానికే గ్రీన్ సిగ్నల్.. ఫ్రీజ్ అయిన నగదుపై నో
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం ఇరువైపులా వాదనలను విన్న అనంతరం పాక్షికంగా ఆదేశాలు జారీ చేసింది. సదరు బ్యాంక్ ఖాతాలను నిత్య లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించుకోవడానికి అనుమతిని ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే, దర్యాప్తు సంస్థల ద్వారా ఫ్రీజ్ అయిన రూ. 3 కోట్ల మొత్తాన్ని మాత్రం ప్రస్తుతం రిలీజ్ చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. దాంతో రవికి బ్యాంక్ ఖాతాల వినియోగానికి మాత్రమే అవకాశం దక్కినట్లయింది.
తాజావార్తలు
-
AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
-
iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
-
Hanuman Ansh : ‘హనుమాన్ అంశ్’చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
-
AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
-
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!