Site icon NTV Telugu

Keerthi Jalli IAS : భళా కీర్తి.. మన తెలంగాణ బిడ్డ‌కు ప్ర‌జ‌లు హ్యాట్సాఫ్‌

Ias

Ias

కొంత మంది ఐఏఎస్ లు.. ఆపేరు అడ్డు పెట్టుకుని అధికార దుర్విని యోగానికి పాల్పడు తుంటే.. మరికొందరు (ఐఏఎస్) ఆపేరును ప్రజల కోసం పాటుపడుతూ.. వారిలో ఒకరిగా, ప్రతి కష్టంలో నేనున్నానంటూ ముందుకు సాగుతున్నవారిలో మన తెలంగాణ ఆడబిడ్డ వుంటుం విశేషం. ఎక్కడున్న మన తెలంగాణ గడ్డపై వున్న మానవత్వాన్ని చాటుకుంటారు. ఎంత పెద్ద ఉన్న‌త స్థానాల్లో వున్నా.. ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో వున్నార‌ని తెలిస్తే చాలు.. హోదాల‌న్నీ ప‌క్క‌న బెట్టి… దుఃఖంలో పాలు పంచుకుంటారు. ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డేసి, ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకునేలా చేస్తారు. తెలంగాణ ఆత్మ‌లోనే అంత సౌంద‌ర్య‌ముంది. ఇప్పుడు ఓ ఐఏఎస్ తెలంగాణ‌లోని ఆత్మ సౌంద‌ర్యాన్ని క‌ష్టాల్లో వున్న ప్ర‌జ‌ల‌కు పంచుతున్నారు.

మీకు పెద్దగా ఆమె వివరాలు నెట్‌లో దొరకవు. పెరిగింది, చదివింది అన్నీ హైదరాబాదే.. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్యూర్ హైదరాబాదీ. తండ్రి కనకయ్య ఉస్మానియాలో చదివాడు… ఇద్దరు ఆడపిల్లలు, ఈమె పెద్దామె. ఇంజనీరింగ్ కాగానే ఢిల్లీకి పంపించాడు కీర్తిని. ఐఏఎస్ కోచింగ్ కోసం ఓ ఏడాది కష్టపడింది. తొలి ప్రయత్నంలోనే 89 ర్యాంకుతో ఐఏఎస్ కొట్టేసింది. అస్సోం కేడర్! కష్టంగా భావించలేదు కీర్తి. ఇష్టంగా వెళ్లి జాయినైపోయింది మన కనకయ్య బిడ్డ కదా.. అస్సోంలోని ప్రతి పల్లే .. నా పల్లె అనుకుందామె.

వారం రోజులుగా అసోంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో ర‌హ‌దారులు, రోడ్లు, భ‌వ‌నాలు, ఇలా అన్నీ నాశ‌న‌మైపోయాయి. వ‌ర‌ద‌లు, భారీ వ‌ర్షాల‌తో స‌ర్వం కోల్పోయి క‌న్నీరు మున్నీరు అవుతున్న ప్ర‌జ‌ల‌కు ఆస‌రా అవుతున్నారు ఆమె. కాళ్ల‌కు చెప్పులు కూడా లేకుండానే.. మోకాళ్ల లోతు బుర‌ద‌లో న‌డుస్తూ, ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ద‌గ్గ‌రుండి తెలుసుకుంటున్నారు. ఆ ఐఏఎస్ పేరు కీర్తి జ‌ల్లి. కుక్క వాకింగ్ కోసం.. స్టేడియంను ఖాళీ చేయించి ఓ ఐఏఎస్ అధికారి విమర్శలు ఎదుర్కుంటుంటే. సామాన్య ప్రజల కష్టాలకు చలించిపోయి.. వాళ్ల సంక్షేమం కోసమే పాటు పడుతూ శభాష్‌ అనిపించుకుంటున్నారు తెలంగాణ అడబిడ్డ. వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు.

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆమె అనుసరిస్తున్న విధానం చూసి తోటి ఐఏఎస్‌లు అభినందిస్తున్నారు. ఆమెకు వృత్తిపై ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న మమకారానికి అందరూ ఫిదా అవుతున్నారు. అదుగో ఆ ఫోటోలు, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆమెకు లభించిన అవార్డుల గురించి ఇక్కడ ఏమీ రాయడం లేదు వాటితో ఆమెకు విలువేమీ లేదు నిజానికి అవే విలువను పెంచుకున్నాయి.

TRS : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు షాడోగా మారిన కాంట్రాక్టర్..?

Exit mobile version