NTV Telugu Site icon

Hydraa: కిస్మత్ పురలో ఉద‌యం హైడ్రా కూల్చివేత‌లు.. సాయంత్రానికి సీసీ రోడ్డు..

Hydra

Hydra

Hydraa: హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ ప‌రిధిలోని కిస్మత్ పురలో రెండు కాలనీలను కలిపే ర‌హ‌దారికపై అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. దీంతో పాటు సాయంత్రానికి అక్కడ సిమ్మెంట్ రోడ్డును వేశారు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు. అయితే, ఫార్చ్యూన్ వెస్ట్ మెడోస్ – శ్రీ హ‌ర్షిత్ లే ఔట్‌ల మ‌ధ్య ఉన్న రోడ్డును ఆక్రమించి కట్టడంతో.. రంగంలోకి దిగిన హైడ్రా కూల్చివేత‌తో ప‌రిస‌ర కాల‌నీల‌కు రోడ్డు క్లియర్ అయింది.

Read Also: Ranya Rao: నవంబర్‌లో వివాహం, డిసెంబర్‌లో విడిపోయాం.. కోర్టులో చెప్పిన రన్యా రావు భర్త

అయితే, రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడను గత ఆరు నెలల క్రితం మున్సిప‌ల్ అధికారులు కూల్చి వేశారు. అయినా, మళ్ళీ తిరిగి అక్రమంగా శ్రీ హ‌ర్షిత్ లేఔట్ నిర్వాహకులు రోడ్డు నిర్మించారు. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో స్థాయిలో విచారించి రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను ఈరోజు ఉదయం హైడ్రా తొలగించింది. దీంతో పాటు మున్సిపాలిటీ అధికారులతో కలిసి సాయంత్రం వరకు సిమ్మెంట్ రోడ్డు వేయడంతో పరిసర ప్రాంతాల కాలనీలకు లైన్ క్లియర్ అయింది.