HYDRA Gunman: హైడ్రా కమిషనర్ వద్ద గన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని తన నివాసంలో గన్‌తో కాల్చుకుని కృష్ణ చైతన్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. భార్యతో కలిసి హయత్‌నగర్‌లో నివసిస్తున్న కృష్ణ చైతన్య తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కృష్ణ చైతన్య పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
IND vs PAK U19 Asia Cup Final: సమీర్ మిన్హాస్ రికార్డు సెంచరీ.. భారత్ ముందు భారీ లక్ష్యం..
సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ వెంటనే కామినేని ఆసుపత్రికి చేరుకుని వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణ చైతన్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన కమిషనర్, చికిత్సకు హైడ్రా సంస్థ పూర్తిస్థాయిలో సహాయం చేస్తుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రెండేళ్ల క్రితం బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అప్పుల భారం పెరగడంతో తీసుకున్న లోన్లకు జీతం ఎక్కువగా కట్ అవుతూ రావడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఈ ఒత్తిడే అతన్ని ఆత్మహత్య యత్నానికి దారి తీసినట్లు భావిస్తున్నారు.
ఇదివరకే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కృష్ణ చైతన్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆయన తండ్రి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే గతంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా తలలో రక్తం గడ్డకట్టడంతో చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల పరంగా కృష్ణ చైతన్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనలేదని అధికారులు స్పష్టం చేశారు. అధికారులతో పాటు ఇతర సిబ్బందితో కూడా మర్యాదగా, గౌరవంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. విధుల విషయంలో అప్రమత్తంగా, క్రమశిక్షణతో ఉన్న వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
PM Modi: ‘‘అస్సాంను పాక్‌కు అప్పగించాలని కాంగ్రెస్ కుట్ర’’.. మోడీ వ్యాఖ్యలపై హస్తం పార్టీ ఫైర్..