Cows Theft: ఖరీదైన కార్లలో వస్తారు.. అక్కడే గంటల తరబడి తిష్ట వేస్తారు.. కబుర్లు చెప్పుకొని వెళ్లిపోతున్నారేమో..? లేదా మందు ఏమైనా తాగుతున్నారా? ఓ దమ్ము లాంగిచి వెళ్తున్నారేమో.. అనుకుంటే పొరపాటే.. ఎందుకుంటే.. ఇంతకీ వాళ్లు ఏం చేస్తున్నారంటూ ఫోకస్ పెట్టిన పోలీసులు.. అసలు విషయం చూసి షాక్ తిన్నారు…
Read Also: Gudivada Amarnath: లోక నాయకుడు కమల్ హాసన్.. లోక మాయకుడు చంద్రబాబు..!
సికింద్రాబాద్‌లో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఆ దృశ్యాలను చూసి పోలీసులు షాక్ తిన్నారు.. ఖరీదైన కార్లలో కొందరు యువకుల వచ్చారు.. గంట పాటు అక్కడే ఉండి వెళ్లిపోయరు. వారేవరో అర్ధం కాక సీసీ కెమెరాలు గమనిస్తే అసలు విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు.. సికింద్రాబాద్ బండిమేట్ ప్రాంతంలో కొందరు యువకులు రాత్రి సమయల్లో ఖరీదైన కారులో వచ్చారు. కొంత సమయనికి అక్కడ కొన్ని ఆవులు స్పహ లేకుండా పడిపోయి ఉండగా.. మరి కొన్ని ఆవులు కనిపించలేదు.. దీంతో, వెంటనే సీసీ టీవీ ఫుటేజ్‌ను స్థానికులు పరిశీలించగా.. కొందరు యువకులు ఆ ఖరీదైన కారులో ఆవులను బలవంతంగా తీసుకెళ్లినట్టు కనిపించింది.. ఈ మధ్య కాలంలో వరుసగా ఆవులు మాయం అవుతుండడంతో ఎటు వెళ్లిపోయయని భావించిన స్థానికులు.. ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆ యువకులపై చర్యలు తీసుకోవలంటూ మోండా మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..
Read Also: YS Jagan Nellore Tour: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. వైసీపీ నేతలపై మరో కేసు నమోదు..
కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో చాలా ప్రాంతాల్లో రోడ్లపైనే గోవులు తిరుగుతూ ఉంటాయి.. కొన్ని సాయంత్రానికి గోశాలకు వెళ్లిపోతే.. మరికొన్ని ఆయా కూడళ్లలోనే ఉండిపోతాయి.. ఇప్పుడు రోడ్లపై ఉన్న గోవులను ఆ యువకులు టార్గెట్‌చేసినట్టుగా తెలుస్తుంది.. గోవులను తరలించడం అంతా ఈజీ కాదు.. అందుకే.. డౌట్ రాకుండా.. వాటికి మత్తు మంది ఇచ్చి.. సైలెంట్‌గా వాటిని కారులో తరలించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది..
