Site icon NTV Telugu

Congress Govt: మహిళలను కోటీశ్వరులు చేసేలా మా పథకాలు..

Assembly

Assembly

Congress Govt: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు ఉందన్నారు. ఇక, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. కాగా, డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో మహిళకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహలక్ష్మీ పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర మహిళలకు రూ.5,005 కోట్లు ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు.

Read Also: Bhatti Vikramarka: కుల మతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యాభ్యాసం..

అలాగే, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 433 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకుంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అంతేగాక ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుపై మంజూరుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పుకొచ్చారు. ఇక, మహిళలకు ఉద్యోగ అవకాశాల్లో కూడా దేశంలోనే అత్యధిక శాతం మన రాష్ట్రమే అవకాశాలు కల్పిస్తున్నదని వెల్లడించారు.

Exit mobile version