Telangana: తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 90,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Read also: Tollywood : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా ఆ హీరోయిన్..ఎవరా భామ..?
భారీ వర్షాలు నేపథ్యంలో గోదావరి తో పాటు దాని ఉపనదులు భారీ ఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండగా అదే స్థాయిలో అన్ని ఉపనదులు పెరుగుతున్నాయి. చత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వరద అంతా కూడా శబరి నదిపై పడుతుంది. శబరి వద్ద 38 అడుగులకు చేరుకోవడంతో దాని ప్రభావం గోదావరి మీద కూడా పడింది. శబరి నది వరదంతా గోదావరిలోకి భద్రాచలం దిగువన చేరుతుండడం తో గోదావరి పై ప్రభావం ఏర్పడుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది .ఇది ఇలా ఉంటే అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది .కూనవరం, విఆర్ పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోకి అనేక గ్రామాల్లో చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోడ్లపైకి నీళ్లు రావడంతో తెలంగాణ నుంచి ఆంధ్ర మీదుగా ఛత్తీస్గడ్ ఒడిస్సా రాష్ట్రాలకు వెళ్లే రహదారులు మూసుకుని వెళ్లిపోయాయి. అధికార యంత్రాంగం కూడా అల్లూరు జిల్లాలో లాంచీలని సిద్ధం చేసింది. శబరి- గోదావరి సంఘమము వద్ద సుమారు 15 లాంచీ లని సిద్ధం చేసి ఉంచింది. ముంపు గ్రామాల నుంచి ప్రజల్ని పునరావస కేంద్రాలకు తరలించడానికి ఇప్పటికే పడవలను సిద్ధం చేసుకోగా అదే విధంగా నిత్యవసర వస్తువులు సరఫరా కోసం లాంచీలని వినియోగించుకోనున్నారు..
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
శ్రీశైలం ప్రాజెక్టుకు 1,04,416 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 99,894 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌కు కూడా వరద పోటెత్తుతోంది. సాగర్‌లో ప్రస్తుతం 504.50 అడుగుల నీటి నిల్వ ఉండగా, ప్రాజెక్టు నుంచి 9,874 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు కూడా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 14,063 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067.10 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.833 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి కూడా ముంపునకు గురవుతోంది. అయితే కృష్ణా బేసిన్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి గోదావరి పరివాహక ప్రాంతాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లికి నామమాత్రపు వరద వస్తోంది. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ జలాశయానికి 6480 క్యూసెక్కుల వరద వస్తోంది. గోదావరికి కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
Geoffrey Boycott Health: ఆసుపత్రిలో క్రికెట్ దిగ్గజం.. పరిస్థితి విషమం!