Telangana CM: ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సామాజిక న్యాయం సమరభేరి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధ పడకండి.. మీకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుంది అని భరోసా ఇచ్చారు. మిమ్మల్ని మంత్రులు చేసే అవకాశం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చూసుకుంటారు.. టికెట్ల కోసం డిల్లీకి పోవాల్సిన బాధ లేదు.. మీకు టికెట్లు ఇచ్చి తొవ్వ ఖర్చులు ఇచ్చి కూడా పంపుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు.. 100 అసెంబ్లీ సీట్లు గెలిచి వస్తాం.. 100కి ఒక్క సీటు కూడా తగ్గకుండా గెలుస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి మాటిస్తున్నాను అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Read Also: WI vs AUS: జోసెఫ్ దెబ్బ.. ఆసీస్ అబ్బా.. తక్కువ స్కోరుకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
ఇక, పనిలో పడి ప్రచారం చేసుకోవడం లేదు మనం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎందుకు ప్రచారం చేసుకోలేక పోతున్నామో అర్థం కావడం లేదన్నారు. వాళ్ళు దుబాయ్ లో ఆఫీసులో పెట్టీ మనపై దుష్ప్రచారం చేస్తున్నారు.. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కల్వకుంట్ల కుటుంబాన్ని తునతునకలు చేయండి.. మమ్మల్ని మీరు గెలిపించారు.. మిమ్మల్ని నేను గెలిపిస్తాను.. ఆ బాధ్యత నేను తీసుకుంటాను.. అన్ని పదవులను త్వరలోనే భర్తీ చేస్తాం.. అప్పటి వరకు విశ్రమించను అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
