Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Water Shutdown In 30 Areas In Hyderabad For 2 Days

Hyderabad Water: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. 2 రోజులు 30 ప్రాంతాల్లో నీళ్లు బంద్..

Published Date :August 17, 2023 , 8:30 am
By NTV WebDesk
Hyderabad Water: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. 2 రోజులు 30 ప్రాంతాల్లో నీళ్లు బంద్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad Water: హైదరాబాద్ వాసులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జల్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 30 ప్రాంతాల్లో పాక్షికంగా లేదా పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. నగరంలో తాగునీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై ఫేజ్-2లో కలబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు పైప్‌లైన్ కోసం అధికారులు జంక్షన్ పనులు నిర్వహిస్తున్నారు. అయితే.. బీహెచ్‌ఈఎల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ జంక్షన్‌ పనులు చేపడుతున్నారు.

ఈ ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుంది..

* O&M డివిజన్ నెం.6: అమీర్ పేట్, SR నగర్, ఎర్రగడ్డ
* O&M డివిజన్ నెం.8: ఆఫ్ టేక్ పాయింట్లు, ఈ డివిజన్ కింద బల్క్ కనెక్షన్లు
* O&M డివిజన్ నెం.9: KPHB కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట
* O&M డివిజన్ నెం.15: ఆర్‌సిపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్
* O&M డివిజన్ నెం.24: బీరంగూడ, అమీన్‌పూర్

పైన పేర్కొన్న ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో నివసించే వినియోగదారులు మంజీరా నీటిని పొదుపుగా వాడుకోవాలని, వాటర్ రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు. 30 ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఆగస్టు 19 ఉదయం నుంచి 20 మధ్యాహ్నం వరకు నీటిని నిలిపి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ఫిబ్రవరిలో కూడా ఇదే పరిస్థితి.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ మురుగునీటి బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌బి) మరమ్మతు పనులు చేపడుతున్నందున హైదరాబాద్‌లోని చాలా చోట్ల 30 గంటల తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. పత్రికా ప్రకటన ప్రకారం, కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ (కెడిడబ్ల్యుఎస్‌పి) ఫేజ్-2కి సంబంధించి 1600 ఎంఎం డయా పైప్‌లైన్ మరమ్మతు పనుల మధ్య ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా మరమ్మతులు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు బాలాపూర్, మేకలమండి, మారేడ్‌పల్లి, తార్నాక, లాలాపేట్, బుద్ధనగర్, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Shankar: ఈయన కమర్షియల్ సినిమాలకి గేమ్ ఛేంజర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • drinking water supply
  • Hyderabad Metropolitan Water Supply
  • Hyderabad Water
  • manjira water
  • Water shutdown in hyderabad

తాజావార్తలు

  • Gaddar Film Awards 2025: గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2025.. ఉత్తమ చిత్రం, విజేతల జాబితా ఇదే!

  • Adulterated Milk Tragedy: కల్తీ పాలు ఘటన.. మరో మహిళ మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య..!

  • Dera Baba: జర్నలిస్ట్ హత్య కేసులో డేరా బాబాకు ఊరట.. నిర్దోషిగా విడుదల

  • Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ ట్రీట్!

  • Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర

ట్రెండింగ్‌

  • India Playing XI vs NZ: ప్రపంచ కప్ ఫైనల్‌ జట్టులో కీలక మార్పు.. న్యూజిలాండ్ కు ఉచ్చు బిగుసుకున్నట్లే.!

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions