Site icon NTV Telugu

బీజేపీ, టీఆర్ఎస్ లు చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయి : ఉత్తమ్

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఉత్తమ్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఏడున్నర ఏళ్లుగా డైరెక్టుగా అలయెన్స్ లో ఉన్నారని, అందుకే టీఆర్‌ఎస్‌ కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు చీకటి ఒప్పందంతో పని చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

120 ఏళ్ల సింగరేణి సంస్థకు ఎంతో ఘన చరిత్ర ఉందని, సింగరేణి కాలరీస్ అనుకోని ఉన్న మైన్స్‌ను కేంద్రం అమ్మకానికి పెట్టడం తుగ్లక్ నిర్ణయమన్నారు. పార్లమెంట్ లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎందుకు మాట్లాడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌లో నేను ప్రస్తావిస్తే పునః పరిశీలన చేస్తామన్నారని ఆయన పేర్కొన్నారు. కోల్ మైన్ ప్రైవేట్ పరం చేసే పనిలో బీజేపీ ఉంటదని ఆఖరి వరకు trs పట్టించుకోదని ఆయన జోస్యం చెప్పారు.

Exit mobile version