Hyderabad Population: కోటి దాటిన హైదరాబాద్ జనాభా.. ప్రస్తుతం ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Population: హైదరాబాద్ నగరం అన్ని మతాలకు ఆతిథ్యమిచ్చే మహానగరం. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల వారు జీవిస్తూ ఉంటారు. అందుకే భాగ్యనగరాన్ని మినీ ఇండియా అని అంటారు. హైదరాబాద్ మరో మైలు రాయిని చేరుకుంది. భాగ్యనగరం జనాభా ప్రస్తుతం 1.05 కోట్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.08 కోట్లకు చేరుతుందని ఐరాస అంచనా వేసింది. దేశంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 నగరాల్లో హైదరాబాద్ చోటు దక్కించుకుంది. జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో దేశంలో 6వ స్థానం, ప్రపంచంలో 34వ స్థానంలో హైదరాబాద్ ఉంది. పట్టణీకరణ పెరగడం వల్ల తెలంగాణ జనాభాలో మూడో వంతు హైదరాబాద్‌లోనే నివసిస్తోంది.
Read Also: Eid-ul-Fitr: కనిపించిన నెలవంక.. దేశంలో రేపే రంజాన్..
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
- Ranganath: ఇక చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తాం.. హైడ్రా కమిషనర్ బిగ్ వార్నింగ్
1950లో హైదరాబాద్ జనాభా 10 లక్షలు మాత్రమే. ఆ తర్వాత 1975 నాటికి జనాభా 20 లక్షలు దాటింది. 1990నాటికి 40 లక్షలకు చేరింది. 2010 నాటికి జనాభా 80 లక్షలు దాటింది. ఏటా 5 లక్షల మంది ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడుతున్నారు. వారిలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య ఏటా సగటున 4.07 లక్షలుగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏటా సగటున 88,216 మంది భాగ్యనగరానికి ఉపాధి కోసం వలస వస్తున్నారు. హైదరాబాద్ అంటే ఎంసీహెచ్ పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే. జీహెచ్‌ఎంసీ ఏర్పాటుతో 650 చదరపు కిలో మీటర్ల పరిధికి విస్తరించింది. అవుటర్ రింగ్‌రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. ప్రతీ ఏటా 5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వస్తున్నారు. హైదరాబాద్ జనాభాలో 14 ఏళ్లలోపు పిల్లలు 25 శాతం ఉన్నారు. 60 శాతంపైగా జనాభా 15 నుంచి 64 ఏళ్ల మధ్యలో ఉంది.
తాజావార్తలు
-
Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
-
Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
-
AI Robot: మునిగిపోతున్న వారిని రక్షించే ఏఐ రోబోట్ ప్రయోగం విజయవంతం
-
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
-
Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!