NTV Telugu Site icon

Kishan Reddy: హైదరాబాద్ లో పండుగ వాతావరణం.. భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ..

Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy: బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్​ పేటలోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. భాగ్యనగరంతోపాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో జరిగే గొప్ప వేడుక బోనాల పండుగ. ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, విషజ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో, పాడి పంటలతో అందరూ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకునే పండుగ ఈ బోనాలు అన్నారు. ఇది ముఖ్యంగా మహిళల పండుగ. ధనిక, పేద అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం చేసి దేవాలయాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్​ నగరంలో ఈరోజు ఏ ఇంటికి వెళ్లినా, ఏ గుడికి వెళ్లినా పండుగ వాతావరణం కనిపిస్తుంది అని తెలిపారు.

Read also: Bhadrachalam: గోదావరికి వరదలు.. గోదావరిలోకి భక్తులను అనుమతించని పోలీసులు..

అన్ని వర్గాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భాగ్యనగర్​ ప్రజలకు గానీ, హైదరాబాద్​ ప్రజలకు గానీ, తెలంగాణ ప్రజలకు గానీ నా తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. బోనాలు ప్రకృతిని పూజించే పండుగ అన్నారు. మనం అందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి.. శక్తిని పూజించుకోవాలని తెలిపారు. దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసుకోవడంలో అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అంబర్​ పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో అనేక సంవత్సరాలుగా అద్భుతంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బోనాల పండుగను వారం పది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. గ్రామాల్లో ఏ రకంగా అంతా కలిసి ఉంటారో.. అంబర్​ పేటలో కూడా అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటూ పండుగా చేస్తారని అన్నారు. ఈ బోనాల పండుగ సందర్భంగా అంబర్​ పేట.. ఈ చుట్టు పక్కల ఉన్న ప్రజలు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. దేవాలయ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు.
Srisailam Project: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..

Show comments