Kishan Reddy: హైదరాబాద్ లో పండుగ వాతావరణం.. భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ..
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు..
- బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బోనాల ఉత్సవాల సందర్భంగా అంబర్ పేటలోని మహంకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. భాగ్యనగరంతోపాటు తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో జరిగే గొప్ప వేడుక బోనాల పండుగ. ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, విషజ్వరాలు రాకూడదని, మంచి వర్షాలతో, పాడి పంటలతో అందరూ కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలని అమ్మవారిని కోరుకునే పండుగ ఈ బోనాలు అన్నారు. ఇది ముఖ్యంగా మహిళల పండుగ. ధనిక, పేద అనే తేడా లేకుండా.. అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి బోనం చేసి దేవాలయాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు ఏ ఇంటికి వెళ్లినా, ఏ గుడికి వెళ్లినా పండుగ వాతావరణం కనిపిస్తుంది అని తెలిపారు.
Read also: Bhadrachalam: గోదావరికి వరదలు.. గోదావరిలోకి భక్తులను అనుమతించని పోలీసులు..
Also Read
అన్ని వర్గాల ప్రజలు భక్తి శ్రద్ధలతో ఏటా బోనాల పండుగ చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ప్రజలకు గానీ, హైదరాబాద్ ప్రజలకు గానీ, తెలంగాణ ప్రజలకు గానీ నా తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. బోనాలు ప్రకృతిని పూజించే పండుగ అన్నారు. మనం అందరం కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాలి.. శక్తిని పూజించుకోవాలని తెలిపారు. దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసుకోవడంలో అమ్మవారి ఆశీస్సులు ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపై ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. అంబర్ పేట మహంకాళి అమ్మవారి దేవాలయంలో అనేక సంవత్సరాలుగా అద్భుతంగా బోనాల పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు ఈ బోనాల పండుగను వారం పది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. గ్రామాల్లో ఏ రకంగా అంతా కలిసి ఉంటారో.. అంబర్ పేటలో కూడా అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉంటూ పండుగా చేస్తారని అన్నారు. ఈ బోనాల పండుగ సందర్భంగా అంబర్ పేట.. ఈ చుట్టు పక్కల ఉన్న ప్రజలు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకుంటారు. దేవాలయ కమిటీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని కిషన్ రెడ్డి అన్నారు.
Srisailam Project: శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద.. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం..
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?