NTV Telugu Site icon

Students Suicide: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య..

Inter Students

Inter Students

Students Suicide: గాల్లో దీపాల్లా ఇంటర్ విద్యార్థుల జీవితాలు మారిపోయాయి. చదువు ఒత్తిళ్ళతో కొంత మంది, అనారోగ్య కారణాలతో మరి కొంత మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ఇంటర్ విద్యార్ధులు తీసుకుంటున్న నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఒకే రోజు ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతుంది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో హాస్టల్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల వెనక తల్లిదండ్రుల పాత్ర ఎంత వరకు ఉంది. స్టూడెుంట్స్ ఆత్మహత్యలకు తల్లిదండ్రుల తప్పు కూడా ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. పేరెంట్స్ ఫాల్స్ ప్రెస్టేజ్ కు వెళ్లి.. పిల్లలను ఇబ్బంది పెడుతున్నారా?.. వాళ్ళ ఇష్టాలకు విలువ ఇవ్వకుండా.. పిల్లలను కన్విన్స్ చేయకుండా, ఒత్తిడి చేస్తున్నారా.? అనే అనుమానం కలుగుతుంది.

Read Also: Champions Trophy 2025: భారత్‌కు రావొద్దు.. పాక్‌కు హర్భజన్‌ కౌంటర్!

ఇక, మేడ్చల్ పరిధిలోని అన్నోజిగూడలో గల నారాయణ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ (ఎంపీసీ) చదువుతున్నాడు బనావత్ తనీష్. సోమవారం సాయంత్రం హాస్టల్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. హుటాహుటీన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తనుష్‌ మృతితో కాలేజీ యాజమన్యంపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేసేందుకు యత్నించారు. కాలేజీలో అధ్యాపకుల వేధింపుల కారణంగానే తమ కొడుకు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఆరోపిస్తున్నారు.

Read Also: Vijayawada: బెజవాడలో అమానుషం.. అప్పుడే పుట్టిన పాపను చెత్త కుప్పలో వదిలేసిన తల్లి

కాగా, నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం చిన్నతడం గ్రామానికి చెందిన ప్రజ్ఞారెడ్డి అనే స్టూడెంట్ ప్రగతినగర్‌లోని ఎన్‌ఎస్‌ఆర్‌ ఇంపల్స్‌ ఐఐటీ గల్స్‌ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే, సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో సదరు విద్యార్థి తన హాస్టల్‌ గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. విద్యార్థిని మృతిని దాచి పెట్టేందుకు యత్నించిన కాలేజీ యాజమాన్యం.. హుటా హుటిన ప్రజ్ఞారెడ్డి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించింది. దీంతో స్టూడెంట్ మృతిపై ఆమె తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నారు. ఒకే రోజు ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

Show comments