CM Revanth Reddy: తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నా వాహనదారులలో మాత్రం మార్పు రావడం లేదు. చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరైనా తప్పులు చేస్తూనే ఉన్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
Read also: Mallu Bhatti Vikramarka: నేడు కరీంనగర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
సచివాలయంలో మున్సిపల్ పాలనపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హోంగార్డు తరహాలో వీరికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పారిశుధ్యం తదితర పనుల పురోగతిపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెండర్లు దక్కించుకున్న వారు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాంట్రాక్టర్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై 15 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పుడు నివేదికలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి సీఎం నిర్ణయంపై ట్రాన్స్ జెండర్లకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ జెండర్లను వ్యవస్థలో ఒక హోదా ఇస్తూ.. వారిని ఒక మనిషిగా గుర్తిస్తున్నందుకు కృతజ్ఙతలు తెలిపారు. అయితే ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులో వస్తాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Cucumber: క్రమం తప్పకుండా దోసకాయ తినడం తింటే ఇన్ని మార్పులా..?