సికింద్రాబాద్: సమాజంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి బాధిత కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. భర్త కొట్టాడని, అత్తింటి వేధింపులు తాళలేక, ఆర్ధిక ఇబ్బందులు ఇలా అనేక కారణాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే తప్పులకు అభంశుభం తెలియని చిన్నారులు కూడా పసిప్రాయంలోనే పాడెక్కుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది.
Read Also: The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
సికింద్రాబాద్ బన్సీలాల్‌పేటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కూతురిని భవనం 8వ అంతస్తు నుంచి కిందపడేసిన అనంతరం.. తల్లి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కవలలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: No Broker: ‘నో బ్రోకర్’ పెట్టిన చిచ్చు.. కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
మరోవైపు ఘటన స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకున్నారు. ఈ ఘటనపై స్థానికులను కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆత్మహత్యకు కారణాలేంటంటే.. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. అంతేకాకుండా డబుల్ బెడ్ రూం తన పేరు మీద రాయాలి అని భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా యాదాద్రిలో భార్య పేరు మీద ఉన్న ల్యాండ్ ని కూడా తన పేరు మీద రాయాలని భర్త గణేష్ వేధించేవాడు. పెళ్లి అయిన తర్వాత.. లావుగా అయ్యావని.. అందంగా లేవని.. తరూచూ భర్త గొడవపడేవాడని స్థానికులు అంటున్నారు. పెళ్లి జరిగిన సమయంలో రూ.2 లక్షల కట్నం ఇచ్చినట్లు మృతురాలి తల్లిదండ్రులు తెలిపారు. యాదాద్రి వద్ద ఉన్న ల్యాండ్ కూడా గణేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినట్లు వారు తెలిపారు.
