NTV Telugu Site icon

Hyderabad: బిగ్‌ అలెర్ట్‌.. 4 రోజులు ఫ్లైఓవర్ ​బంద్..! ఎక్కడంటే..

Hyderabad Flyover

Hyderabad Flyover

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్ హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ చేసింది. శిల్పా లేవుట్ లెవల్ – 2 ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా అక్కడ ఐదు రోజుల పాటు ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌ఆర్‌డీపీ శిల్పా లేఅవుట్ లెవల్ -2 గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మాణ పనుల కారణంగా నాలుగు రోజుల పాటు ఫ్లై ఓవర్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంటే సోమవారం 12వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లై ఓవరు మూసివేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ప్రకటనలో తెలిపారు.

Read also: Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి

గచ్చిబౌలి గుండా వెళ్లాల్సిన వాహనాలు ఆ మార్గం గుండా కాకుండా మరో మార్గం వైపు మళ్లింపులు చేపట్టారు. బయోడైవర్సీటి జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్, బైపాస్, బ్రిడ్జీ గుండి టెలికాం నగర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఐఐఐటీ జంక్షన్ నుంచి బయోడైవర్సిటి జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు బ్రిడ్జీ గుండా గచ్చిబౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఐదు రోజుల పాటు ఉంటాయి.. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలకు అనుసరించి తమకు సహకరించాలని సైబరా పోలీసులు కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు ఐదు రోజులు ఉంటాయి.. గురువారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం 12వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఉంటుంది.అటుగా వచ్చే వాహనదారులకు సరైన సమాచారం అందించాలని ట్రాఫిక్ పోలీసులకు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. ఐదు రోజుల వరకు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాల్సిందిగా సూచించాలని తెలిపారు.
KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..