పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్, రీపోలింగ్‌కి ఆదేశం.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా ఆందోళనలు..
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. దీంతో ఆ దేశంలో విజేత ఎవరనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిచ్చారు. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్‌కి పాక్ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నెల 15న రీపోలింగ్ జరగనుంది.
24 కోట్ల జనాభా కలిగిన పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న 226 స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ చేయకున్నా, అతడి పార్టీ గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేసిన అతని మద్దతుదారులు స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగి 100 స్థానాలను కైవసం చేసుకున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ‘‘పాక్ ముస్లిం లీగ్-నవాజ్’’ 72 స్థానాల్లో, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) 54 స్థానాల్లో, ఇతర చిన్నాచితక పార్టీలు 27 సీట్లు గెలుచుకున్నాయి. 133 మెజారిటీ మార్కు కాగా..ఏ ఒక్క పార్టీ కూడా క్లియర్ మెజారిటీని సంపాదించుకోలేదు.
బడ్జెట్ లో 13శాతం అప్పుల చెల్లింపులకే పోతుంది
గత ప్రభుత్వం అప్పులను మిగిల్చి వెళ్తే… బడ్జెట్ లో 13శాతం అప్పుల చెల్లింపులకే పోతుందని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ డివిజన్ లో ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్ ను ప్రారంభించారు. అనంతరం సనత్ నగర్ నియోజక వర్గంలో ఆయన పర్యటనలో మాట్లాడుతూ.. బడ్జెట్ లో సంక్షేమం, విద్యా, వైద్యం కు పెద్దపీట వేసామన్నారు. గత ప్రభుత్వం అంకెల, మాటల గారడితో కాలం వెల్లదీసిందన్నారు. రెగ్యులర్ బడ్జెట్ చాలా గొప్పగా ఉంటుందన్నారు. RRR సూపర్ గేమ్ చేంజ్ గా… తెలంగాణాకు తలమానికంగా మారబోతుందన్నారు. మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ వల్లే RRR ఆలస్యం అయ్యిందన్నారు. SLBC ఎన్నికల అస్త్రం గానే చూసారు కేసీఆర్ అన్నారు. SLBC నీ నిర్లక్ష్యం చేసి, నల్లగొండ జిల్లాను ఎండబెట్టుంది కేసీఆర్ అని మండిపడ్డారు.
“మీ పేరెంట్స్ నాకు ఓటేయకుంటే రెండు రోజులు తినకండి”.. పిల్లలతో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఎమ్మెల్యే సంతోష్ బంగర్ పిల్లలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే మీరు రెండు రోజుల పాటు తినొద్దని కోరడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
కలమ్‌నూరి ఎమ్మెల్యే అయిన సంతోష్ బంగర్ హింగోలి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన సమయంలో ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని కోరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 10 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలతో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడటాన్ని అంతా తప్పుబడుతున్నారు.‘‘ ఒకవేళ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. సంతోష్ బంగార్‌కి ఓటేయండి, అప్పుడు మాత్రమే తింటాము’’ అని చెప్పాలని పిల్లల్ని ఎమ్మెల్యే కోరాడు.
కొనసాగుతున్న బండి ‘ప్రజాహిత యాత్ర’.. ఈరోజు ఎక్కడంటే..
కరీంనగర్ పార్లమెంట్ లో ఎంపీ బండి సంజయ్ దూకుడు పెంచారు. ప్రజాహిత యాత్రను ప్రారంభించారు. జగిత్యాల జిల్లాల్లో రెండవ రోజు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. కథలాపూర్ మండలం సిరికొండ నుండి చందుర్తి మండలం నర్సింగపూర్ వరకు యాత్ర ముందు సాగుతుంది. బడ్జెట్ లో హామీల అమలు కోసం కేటాయించిన నిధులు 53 వేల కోట్లు మాత్రమే అన్నారు. బడ్జెట్ సాక్షిగటా బీసీలను దారుణంగా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామని హామీని పూర్తిగా విస్మరించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేమని బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పీవీ నర్సింహారావును దారుణంగా వంచించిన పార్టీ కాంగ్రెస్.. పీవీ చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపని నీచమైన పార్టీ కాంగ్రెస్.. పీవీ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే కనీసం నోరుమెదపని పార్టీ కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ ఘాట్ పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన పార్టీ బీజేపీ అన్నారు.
అమిత్ షా పొత్తు కామెంట్.. పురంధేశ్వరి ఏమన్నారంటే..
మోడీ తీసుకునే నిర్ణయాలు ఓట్ల కోసం కాదు.. పేదల కోసమని బీజేపీ ఏపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అమిత్ షా పొత్తు కామెంట్లపై ఆమె స్పందించారు. బీజేపీ తన ప్రస్థానాన్ని ఇద్దరు ఎంపీలతో ప్రారంభించిందన్నారు. పార్టీ ఎదుగుదలకు అనుకూలమైన నిర్ణయాలు ఉంటాయన్నారు. పరిస్థితులను సమీక్షించుకుని పార్టీ బలోపేతంపై అమిత్ షా నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. పొత్తుల విషయంలో కార్యకర్తలకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు పని చేస్తున్నారని, దేశంలో పారిశ్రామిక ప్రొత్సాహాం.. ఉపాధి కల్పన ఉండాలని దీన్ దయాళ్ చెప్పేవారని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో దేశాభివృద్ధి, ఉపాధి కల్పన లభిస్తుందనేది దీన్ దయాళ్ సిద్దాంతం అన్నారు.
ఈరోజు సీఎల్పీ మీటింగ్.. అందరూ రావాలె..
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) సమావేశం నేడు జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్‌లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం నీటిపారుదల శాఖలో ప్రాజెక్టులు, అక్రమాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నారు.
త్వరలో దేశ రహదారులు అమెరికా వాటిలా మారుతాయన్న నితిన్ గడ్కరీ
త్వరలో ఇండియా రోడ్లు అమెరికాలా మారనున్నాయి. దేశంలోని రోడ్లు, హైవేలను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం రోజురోజుకు కృషి చేస్తోంది. అదే సమయంలో భారత్ రోడ్లు అమెరికా తరహాలో మారే రోజు ఎంతో దూరంలో లేదు. ఇది మేం చెప్పేది కాదు స్వయంగా రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చేరుకోవడంలో రోడ్లదే కీలక పాత్ర అని గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. భారతదేశ రహదారులు ఎప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ అవతాయో ఆయన చెప్పారు.
భారత్‌ని మా నుంచి దూరం చేసేందుకు పాశ్చాత్య దేశాల కుట్ర..
భారత్‌ని తమ నుంచి దూరం చేయాలని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా ఆరోపించింది. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోల్ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, మాస్కో మధ్య దీర్ఘకాల సంబంధాలకు అంతరాయం కలిగించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాంటూ మండిపడ్డారు. శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి రష్యా తన మద్దతుని ప్రకటించింది.
వెస్ట్రన్ దేశాలు సెకండరీ ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాయని, కొంతమంది భారతీయ భాగస్వాములు కొన్ని సార్లు జాగ్రత్త వహిస్తున్నారని, కానీ చాలా మంది వాటిని లెక్క చేయడం లేదని రష్యా రాయబారి అన్నారు. రష్యా, భారత్ భాగస్వామ్యానికి రక్షణ సహకారంగా ఉందని, ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా మారిందని డెనిస్ అలిపోవ్ చెప్పారు.
సీఎం రేవంత్ పై కామెంట్స్.. బాల్క సుమన్ కు నోటీసులు
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి… ఇందులో భాగంగా ఆదివారం నోటీసులు అందజేశారు. నోటీసులు అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు. పోలీసుల నోటీసులపై బాల్క సుమన్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మంచిర్యాల ఎస్సై కేసులకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొని పోరాడిన పార్టీ తమదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు.
బీజేపీకి ఒంటరిగానే 370 పైగా ఎంపీ సీట్లను గెలుస్తుంది..
2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్‌గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. బీజేపీ దృష్టితో గిరిజనులు ఓటు బ్యాంకు కాదని, వారు దేశానికి గర్వకారణమని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ చాలా ఏళ్లు దేశాన్ని పాలించినా కేవలం 100 ఏకలవ్య పాఠశాలన్ని మాత్రమే ప్రారంభించిందని, బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో దీనికి నాలుగు రెట్లు ఎక్కువగా ఏకలవ్య పాఠశాలను ప్రారంభించిందని చెప్పారు. దేశంలో ఒక్క ఆదివాసీ బిడ్డ చదువులేక వెనకబడటం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. గిరిజనులు వేల ఏళ్లుగా అటవీ సంపదతో జీవనోపాధి పొందుతోందని, తమ ప్రభుత్వం ఫారెస్ట్ ప్రాపర్టీ చట్టంతో మార్పులు చేస్తూ.. అటవీ భూమికి సంబంధించి గిరిజనులకు హక్కుల్ని కల్పించిందని పీఎం మోడీ చెప్పారు. గిరిజనులను ‘సికెల్ సెల్ ఎనీమియా’ బాధపడుతున్నా.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓల బదిలీలు
రాష్ట్రంలో భారీగా ఎంపీడీఓల బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే.. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎంపీడీఓలను బదిలీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సేవలందిస్తున్న 395 మంది ఎంపీడీవోలను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారితో పాటు మూడేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని గతేడాది డిసెంబర్‌లో ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం 395 మంది మండల పరిషత్ డెవలప్‌మెంట్ అధికారులను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్. అయితే.. ఇదిలా ఉండగా.. శనివారం ప్రభుత్వం 32 మంది డిప్యూటీ కలెక్టర్లతో పాటు 132 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్-1లో 84 మంది తహసీల్దార్లు, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.
ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
ఈ నెల 20 నుండి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పోస్టర్‌ను అవిస్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి దేశ వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో సానుకూల వాతావరణం ఉందన్నారు. ప్రజలు నరేంద్ర మోడీకి కమలం పువ్వుకే ఓటేసెందుకు ముందే నిర్ణయం తీసుకున్నారని, తెలంగాణ లో బీజేపీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామన్నారు. తెలంగాణ ప్రజల మద్దతు, ఆశీస్సుల కోసం 5 యాత్రలు నిర్వహించాలని …ఫిబ్రవరి 20 నుండి మార్చి ఒకటి వరకు యాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 5 పార్లమెంట్ క్లస్టర్ లలో 5 విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాత్రలకు క్లస్టర్ వారీగా పేర్లు పెట్టినట్లు, భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , హైదారాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్ర కి భాగ్యనగరం అని పేరును ఖరారు చేసినట్లు తెలిపారు. కరీంనగర్ , మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని, అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరును నిర్ణయించినట్లు వెల్లడించారు.
