NTV Telugu Site icon

Ekadasi 2024: ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. తొలి ఏకాదశి సందర్భంగా సందడి..

Rajanna Siricilla

Rajanna Siricilla

Ekadasi 2024: రాష్ట్రమంతటా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. తొలి ఏకాదశి, మొహరం ఒకే రోజు కావడంతో భక్తులు పూజలు, ప్రార్థనలతో నిమగ్నమై ఉన్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల వద్ద క్యూలు కట్టారు. యాదగిరిగుట్ట, బాసర, శ్రీశైలం, వేములవాడ, భద్రాచలం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కొందరు ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్షలు చేస్తున్నారని తెలిపారు. వర్షం కారణంగా కొన్ని చోట్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

Read also: Viral Photo: ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీల స్టార్‌ హీరోలు.. ఫొటో వైరల్‌!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. ఆలయ అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు, పరివార దేవతార్చనలు నిర్వహించి కల్యాణ మండపంలో 24 గంటల పాటు అఖండ భజన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ఆలయం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు, అధికారులు కాలినడకన గోదావరి నదిలో త్రివేణి సంగమం వద్దకు చేరుకుని కుండలలో గోదావరి జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే వర్షంలోనే కాళేశ్వరం చేరుకుని పవిత్ర త్రివేణి సంగమం గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

Read also: Islamic Calendar: ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం..

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భారీ వర్షాల కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న శ్రీవారిని 87 వేల మందికి పైగా దర్శించుకున్నారు. 4 కోట్ల 53 లక్షల రూపాయలు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
CM Revanth Reddy: నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం.. పార్టీ కార్యక్రమాలపై చర్చ..