NTV Telugu Site icon

Minister Seethakka: శాసన మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం.. మంత్రి సీతక్క రియాక్షన్!

Seethakka

Seethakka

Minister Seethakka: శాసన మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సవరణ-2025 బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. ఈ బిల్లుపై చాలా మంది సభ్యులు విలువైన సూచనలు చేశారు.. ఈ బిల్లులో లేని అంశాలను సభ్యులు ప్రస్తావించారు.. సభ్యులు ప్రతిపాదనలు పంపితే పరిశీలిస్తాం.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు షెడ్యూల్ ఏరియాలో గుర్తించారు.. ఏమైనా సమస్యలు ఉంటే పరష్కరిస్తాం.. మాకు మున్సిపాలిటీ కావాలని ఎన్నో గ్రామ ప్రజలు అడుగుతున్నారు.. మున్సిపాలిటీలు అయితే డెవలప్ అయితామని అనుకుంటున్నారు. ములుగు జిల్లా కేంద్రమైనా మునిసిపాలిటీ చేయలేదు.. కానీ, ఇప్పుడు మనం ములుగును మున్సిపాలిటీగా చేసుకుంటున్నాం.. ప్రజల అభిప్రాయం, కలెక్టర్లు పంపిన ప్రతిపాదనలు ఆధారంగా మున్సిపాలిటీలుగా అప్డేట్ చేస్తున్నాం.. చాలా మండలాల్లోని గ్రామాలను ఇతర జిల్లాల్లో కలిపారు.. స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నో గందరగోళాలు తలెత్తుతున్నాయని మంత్రి సీతక్క చెప్పుకొచ్చింది.

Read Also: Apsara Murder Case: సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు..

ఇక, కొన్ని గ్రామాలు ఒక మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాయి.. రెవిన్యూ పరిధి వేరే మండలంలో ఉంటుంది అని మంత్రి సీతక్క పేర్కొనింది. ఆ సమస్యలకు పరిష్కారం చూపుతాం.. ఇద్దరు పిల్లల నిబంధన ఎట్టేయాలని అడుగుతున్నారు.. కేబినెట్, ముఖ్యమంత్రితో చర్చిస్తాం.. కొత్త గ్రామ పంచాయతీలలో రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తాం.. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని కొందరు సభ్యులు ప్రస్తావించారు.. వాటిని పరిష్కరిస్తున్నాం.. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదించుకున్నాం.. కేంద్రం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి.. అన్ని పార్టీలు కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అని సీతక్క కోరారు.