NTV Telugu Site icon

Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..

Instagram Reels

Instagram Reels

Instagram Reels: సోషల్ మీడియాకు ప్రజలు బాగా అడిక్ట్ అయ్యారు. అందరూ రకరకాలుగా వీడియోలు తీస్తూ.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూస్, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనుకాడరు. అంతేకాదు ఇటీవలి కాలంలో యువత రీళ్ల మోజులో పడి ఏం చేస్తున్నామో మరిచి వింతగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పబ్లిక్‌గా విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు రోడ్డుపై రొమాన్స్ చేస్తూ… ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ యువతి తుపాకీ పట్టుకుని నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారు. తాజాగా ఓ యువకుడు పబ్లిక్ రోడ్డుపై నోట్లను విసిరి వీరంగం సృష్టించాడు. దీంతో రోడ్డుపై డబ్బులకోసం ప్రజలు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

Read also: Rajnath Singh: కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్

హైదరాబాద్ రోడ్లపై యువకుడి హల్చల్ చేశాడు. రద్దీ రోడ్డు లపై వంద, 200 రూపాయలు నోట్లు చల్లుతూ హంగామా చేశాడు. తనను ఫాలో అయితే డబ్బులు ఎలా సంపాదిస్తాలో చెప్తానంటూ హల్చల్ చేస్తూ నడిరోడ్డుపై కనిపించాడు. రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లి నోట్లను గాల్లోకి విసురుతూ చల్లుతూ హంగామా సృష్టించాడు. డబ్బులు రోడ్డుపై పడటంతో ప్రజలు వాటిని తీసుకునేందుకు నడిరోడ్డుపై పరుగులు పెట్టారు. ఆ యువకుడు చల్లిన నోట్లను తీసుకునేందుకు జనాలు ఎగబడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ మరికొంత మంది జనాలకు, పోలీసులకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. చూస్తున్నట్లే రోడ్డుపై భారీగా జనాలు రావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రోడ్డుపై డబ్బులు ఏరుకుంటున్న జనాలను చూసి బిత్తరపోయారు. ఇదంతా ఓ యువకుడు తన రీల్స్ కోసం నడిరోడ్డుపై డబ్బులు చల్లాడని గుర్తించారు. అక్కడ ఆ యువకుడి కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. అయితే దీనంతటి కారణమైన ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. అక్కడే వున్న సీసీ కెమెరాల సహాయంతో ఆ యువకుడిని కనుగునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రీల్స్ చేస్తూ రోడ్డుపై ప్రయాణికులకు, పోలీసులకు ఆటంకం కలిగిస్తే కేసు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆ యువకుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
BCCI Prize Money: 2024లో రూ.125 కోట్ల నజరానా.. 1983లో బీసీసీఐ ఎంత ఇచ్చిందో తెలుసా? అస్సలు ఊహించలేరు

Show comments