తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజుల రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రచ్చబండ కార్యక్రమం ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్నారని ఆయన బైకాట్ చేశారు.
అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమం చేద్దామనుకున్న ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారని అన్నారు. అదే బీజేపీ ధర్నా అంటే మాత్రం ఎం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులను అరెస్ట్ చేశారు నేను దీన్ని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. అంతేకాకుండా జగ్గారెడ్డి మాట్లాడిందంట్లో తప్పు లేదని, ఆయనకు సమాచారం ఇవ్వకపోవడం కరెక్ట్ కాదుని వెల్లడించారు. అందరిని కలుపుకుని పోవాలని మరోసారి పీసీసీకి చెప్తున్నానని, ఇంత పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నపుడు పార్టీలో చర్చించాలని ఆయన అన్నారు. దీనికి సంభందించి మాణిక్యం ఠాగూర్ తో కూడా మాట్లాడతానని వీహెచ్ పేర్కొన్నారు.
