NTV Telugu Site icon

Telangana Assembly 2024: తెలంగాణ తల్లికి అధికార గుర్తింపు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి..

Cm Asembly

Cm Asembly

Telangana Assembly 2024: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా.. సోనియాగాంధీ 78వ జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు కళ్ళ ముందే కోల్పోయిన తల్లి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ తల్లి పై ప్రకటన సీఎం మాట్లాడుతూ.. చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ తల్లి నిలిచి పోవాలని సీఎం రేవంత్‌ అన్నారు. తెలంగాణ తల్లికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదని అన్నారు. అలాంటి గుర్తింపు ఇవ్వాలని అనుకున్నామని సీఎం అన్నారు. తెలంగాణ తల్లి అంటే భావన కాదు.. నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాంటి తల్లి విగ్రహ ఆవిష్కరణ సచివాలయంలో జరుపుకోబోతున్నామని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు నిలువెత్తు తల్లి.. తెలంగాణ విగ్రహం అన్నారు.

Read also: Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..

చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించామన్నారు. పీఠంలో నీలి రంగు, గోదావరి, కృష్ణమ్మల గుర్తులు అమర్చినట్లు తెలిపారు. టీజీ తెలంగాణ ఆత్మగౌరవం ప్రతీక అన్నారు. ఉద్యమం సందర్భంగా.. స్ఫూర్తి ఇచ్చిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. పదేళ్లు మనకు రాష్ట్ర గీతం లేదని సీఎం అన్నారు. తెలంగాణ ప్రతి రూపమే అధికారికారికంగా లేదని తెలిపారు. తెలంగాణ తల్లి దేవతా మూర్తిలా ఉండాలా? తల్లిగా ఉండాలా అనే చర్చ జరిగిందన్నారు. దేవతా గుడిలో… తల్లి ఇంట్లో ఉంటుందని సీఎం అన్నారు. మేధావులు, కవుల సూచన మేరకు తెలంగాణ తల్లి విగ్రహం రూప కల్పన చేశామన్నారు. కొందరికి ఇది నచ్చలేదని తెలిపారు. వాళ్ళ పార్టీ విధానమే ప్రజల అభిప్రాయం కావాలనే భావనలో ఉన్నారని అన్నారు. చక్రవర్తుల ఆలోచన చెల్లదని అన్నారు. అందుకే సభకు రాలేదని అన్నారు.
CM Revanth Reddy: దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి