Cough syrup Alert: దగ్గు సిరప్‌పై తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల
- దగ్గు సిరప్‌పై తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్
- మార్గదర్శకాలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దగ్గు సిరప్ ప్రస్తుతం దేశంలో మృత్యువుగా వెంటాడుతోంది. దగ్గు సిరప్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిన్నారులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో నలుగురు పిల్లలు ప్రాణాలు వదిలారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కూడా చిన్నారులు చనిపోయారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
ఇది కూడా చదవండి: Trump: బిన్ లాడెన్‌ను చంపినోళ్లను ఎవరు మరిచిపోరు.. నేవీ సీల్స్‌పై ట్రంప్ ప్రశంసలు
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. దగ్గు సిరప్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. రెండేళ్లలోపు పిల్లలకు కఫ్, కోల్డ్ సిరప్లు ఇవ్వొద్దని సూచించింది. కఫ్, కోల్డ్లు తాత్కాలికం మాత్రమేనని… ఎక్కువ శాతం కేసులు స్వయంగానే తగ్గుతాయని డీఎంహెచ్‌వోలకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులన్నింటికీ ఆదేశాలు చేరవేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే…!
కఫ్ తగ్గించేందుకు మొదట హోమ్ కేర్, నీటి పానీయాలు, విశ్రాంతి అవసరమని తెలిపింది. ఇక జీఎంపీ ప్రమాణాలతో తయారైన సిరప్‌లను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. అడల్టరేషన్ ఉన్న కోల్డ్రిఫ్ సిరప్ వాడొద్దని డ్రగ్ కంట్రోల్ అలర్ట్ చేసింది. బ్యాచ్ నంబర్ SR-13, మే 2025 తయారీ, ఏప్రిల్ 2027 గడువు ఉన్న సిరప్ రీకాల్ చేయాలని ఆదేశించింది. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన డైఇథిలీన్ గ్లైకాల్ కలుషితం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. సిరప్ ఉన్నవారు వెంటనే స్థానిక డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్ని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించింది. ఇక సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969ను అధికారులు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్‌లో మేనేజర్ ఏం చేశాడంటే..!
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!