Site icon NTV Telugu

Cough syrup Alert: దగ్గు సిరప్‌పై తెలంగాణ ఆరోగ్యశాఖ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల

Telangana Cough Syrup Alert

Telangana Cough Syrup Alert

దగ్గు సిరప్ ప్రస్తుతం దేశంలో మృత్యువుగా వెంటాడుతోంది. దగ్గు సిరప్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిన్నారులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో నలుగురు పిల్లలు ప్రాణాలు వదిలారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో కూడా చిన్నారులు చనిపోయారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.

ఇది కూడా చదవండి: Trump: బిన్ లాడెన్‌ను చంపినోళ్లను ఎవరు మరిచిపోరు.. నేవీ సీల్స్‌‌పై ట్రంప్ ప్రశంసలు

తాజాగా తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. దగ్గు సిరప్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. రెండేళ్లలోపు పిల్లలకు కఫ్‌, కోల్డ్‌ సిరప్‌లు ఇవ్వొద్దని సూచించింది. కఫ్‌, కోల్డ్‌‌‌లు తాత్కాలికం మాత్రమేనని… ఎక్కువ శాతం కేసులు స్వయంగానే తగ్గుతాయని డీఎంహెచ్‌వోలకు హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్‌, ప్రభుత్వ ఆస్పత్రులన్నింటికీ ఆదేశాలు చేరవేయాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే…!

కఫ్‌ తగ్గించేందుకు మొదట హోమ్‌ కేర్‌, నీటి పానీయాలు, విశ్రాంతి అవసరమని తెలిపింది. ఇక జీఎంపీ ప్రమాణాలతో తయారైన సిరప్‌లను మాత్రమే వాడాలని స్పష్టం చేసింది. అడల్టరేషన్‌ ఉన్న కోల్డ్రిఫ్‌ సిరప్‌ వాడొద్దని డ్రగ్‌ కంట్రోల్‌ అలర్ట్‌ చేసింది. బ్యాచ్‌ నంబర్‌ SR-13, మే 2025 తయారీ, ఏప్రిల్ 2027 గడువు ఉన్న సిరప్‌ రీకాల్‌ చేయాలని ఆదేశించింది. ఈ సిరప్‌లో ప్రమాదకరమైన డైఇథిలీన్‌ గ్లైకాల్‌ కలుషితం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. సిరప్‌ ఉన్నవారు వెంటనే స్థానిక డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్ని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించింది. ఇక సమాచారం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-599-6969‌ను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్‌లో మేనేజర్ ఏం చేశాడంటే..!

Exit mobile version