Site icon NTV Telugu

TG Assembly: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. భూ భారతి, రైతు భరోసా పై చర్చ

Telangana Assembly 20024

Telangana Assembly 20024

TG Assembly: ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమావేశాలు రద్దయ్యాయి. “భూ భారతి” బిల్లుపై నేరుగా చర్చ జరుగుతుంది. రైతు భరోసా విధివిధానాలపై కూడా సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనమండలిలో జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో రైతు భరోసా విధివిధానాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. కాగా.. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులకు ఇప్పటికే శాసనసభ ఆమోదం తెలిపింది. హైడ్రామాకు అధికారాలు కల్పిస్తూ తీసుకొచ్చిన జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లుపై అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ సభ్యులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏ మాత్రం ఆలోచించకుండా అనేక కట్టడాలను కూల్చివేసి పేదలు భయపడే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ సభ్యులు విమర్శించారు. చెరువులు, చెరువుల దగ్గర లక్షలాది పేదల ఇళ్లు ఉన్నాయని అందరికీ భరోసా ఇవ్వాలని కోరారు.

Read also: Dmart Fraud: 100 గ్రాముల ప్యాకెట్‌ పై 500 గ్రాముల స్టిక్కర్.. డీమార్ట్‌ పై కేసు నమోదు..

హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. హైదరాబాద్‌లోని ట్యాంకులు, చెరువులు, కాలువల పరిరక్షణ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పేదల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. తాము లేవనెత్తిన అంశాలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మున్సిపల్, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులతో పాటు జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లును విపక్ష సభ్యుల హాజరు లేకుండానే శాసనసభ ఆమోదించింది.
Congress: అంబేడ్కర్‌పై అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు.. నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు!

Exit mobile version