NTV Telugu Site icon

Minister Uttam: కేబినెట్ నిర్ణయంతో రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం..

Uttam

Uttam

Minister Uttam: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ బియ్యంతో ఒక మాఫీయా నడిపిస్తున్నారు.. కేబినెట్ నిర్ణయం మేరకు రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం.. ఉగాది రోజు సన్న బియ్యం పథకం ప్రారంభం అవుతుంది అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ కార్డు హోల్డర్లకు 6 కిలోల సన్న బియ్యం ఫ్రీగా అందజేస్తాం.. సన్న బియ్యంపై సభ్యులు ఏమైనా సలహాలు, సూచనలు చేస్తే తీసుకుంటాం.. ఏప్రిల్ మాసంలో కొత్త రేషన్ బియ్యం వస్తుంది.. ఈ పథకంతో 84 శాతం మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.. సన్న బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులు కూడా త్వరలో ఇస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు.

Read Also: Miami Open 2025: టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు.. అదనపు భద్రత కేటాయింపు!

ఇక, గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ఇరిగేషన్ బడ్జెట్ లో పెట్టామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరిట అప్పులు తీసుకున్నారు కానీ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, ఆయకట్టు పెరగలేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి వివక్ష ఉండదు అని తేల్చి చెప్పారు. కేటగిరి బేస్ గా ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తున్నాం.. అలాగే, SLBC ఘటన చాలా బాధాకరం.. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లో నేను అక్కడ ఉన్నాను.. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేస్తున్నాం.. ఇప్పటికీ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.