CM Revanth Reddy: ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి సీరేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా అకాడమీ ఏర్పాటుతో పాటు హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రధాన స్టేడియాలను ఒకే హబ్ గా తీర్చిదిద్దాలి అని సూచించారు. ఇక, స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాల పైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని పాలసీ సిద్ధం చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Deputy CM Pawan Kalyan: సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన పవన్.. కీలక వ్యాఖ్యలు
ఆ తర్వాత, పేద ప్రజల హృదయాలలో దీపమై వెలిగిన మహనీయుడు కాకా (జి. వెంకటస్వామి) అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జి.వెంకటస్వామి జయంతి (05-10-2024) సందర్బంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా కేంద్రమంత్రిగా, సేవలందించారని.. సింగరేణి కార్మికుల జీవితాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని.. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో కాకా అలు పెరుగని పోరాటం చేసారని.. 1969లో తెలంగాణ కోసం జైలు కెళ్లాడని అన్నారు. ఆయన జీవితం కార్మికులు, పేదలతోనే మమేకమైందని.. నిలువ నీడ లేని నిరుపేదలకు గూడు కల్పించాలని గుడిసెల పోరాటం చేసి.. కొన్ని వేల గుడిసెలు పేద లకోసం వేయించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.