Site icon NTV Telugu

KBR Park: సరికొత్తగా కేబీఆర్ పార్క్.. చుట్టూ ఫ్లైఓవర్స్, అండర్ పాస్‌లను గ్రీన్ సిగ్నల్..

Kbr Park

Kbr Park

KBR Park: హైదరాబాద్ మహా నగరానికి నడిబొడ్డున ఉన్న కేబీఆర్ చుట్టూ నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో వాహనాదారులు తీవ్ర పడుతుంటారు. అయితే, నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగానే కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్‌లు లేకుండా చర్యలు చేపట్టింది. 826 కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

* రూ. 421 కోట్లతో ప్యాకేజీ-1లో జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు జంక్షన్‌
1. రోడ్డు నెం.45 నుంచి కేబీఆర్‌ పార్కు యూసఫ్‌గూడ వైపు వై ఆకారంలో అండర్‌పాస్‌.
2. కేబీఆర్‌ పార్కు ప్రవేశం నుంచి రోడ్డు నెం.36 వరకు నాలుగు లైన్ల ప్లైఓవర్‌.
3. యూసఫ్‌గూడ వైపు నుంచి రోడ్డు నెం.45 జంక్షన్‌ వరకు రెండు లైన్ల ప్లైఓవర్‌.

*కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ ముగ్ధ జంక్షన్‌
1. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వరకు 2 లేన్ల అండర్‌పాస్‌
2. పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మూడు లేన్ల ప్లైఓవర్‌
3. కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ జంక్షన్‌ నుంచి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్‌ పాస్‌

*405కోట్లతో ప్యాకేజీ-2లో.. రోడ్‌ నెం.45 జంక్షన్‌
1. ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వైపు వరకు అండర్‌ పాస్‌*
2. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి రోడ్‌ నెంబర్‌-45 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌

*ఫిలింనగర్‌ జంక్షన్‌
1. అగ్రసేన్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నెం.45 జంక్షన్‌ వరకు 2 లైన్ల అండర్‌పాస్‌
2. ఫిలింనగర్‌ జంక్షన్‌ నుంచి అగ్రసేన్‌ జంక్షన్‌ వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌

*మహారాజా అగ్రసేన్‌ జంక్షన్‌
1. క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ నుంచి ఫిలింనగర్‌ జంక్షన్‌ వరకు అండర్‌ పాస్‌
2. ఫిలింనగర్‌ జంక్షన్‌ నుంచి రోడ్‌ నెంబర్‌-12 వరకు రెండు లైన్ల ఫ్లైఓవర్‌

*క్యాన్సర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌
1. కేబీఆర్‌ పార్కు నుంచి అగ్రసేన్‌ జంక్షన్‌ వరకు రెండు లైన్ల అండర్‌ పాస్‌

Exit mobile version