NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు మరోసారి మహారాష్ట్రకు సీఎం.. రెండు రోజులు షెడ్యూల్ ఇదే..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth eddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ మరోసారి మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్​ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్​ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్‌ కు బయలుదేరనున్నారు. అక్కడ చంద్రాపూర్​ లో నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దా​ నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్‌పూర్‌​ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. ఇక రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్‌పూర్‌ నుంచి నాందేడ్‌ చేరుకుంటారు. నయగావ్, భోకర్​​, షోలాపూర్​ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌ కు తిరిగి రానున్నట్లు తెలుస్తుంది.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేపధ్యంలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీయే కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్డీయే నుంచి కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో సందడి చేశారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ముంబైలో బీజేపీ నేతలు తమ మిత్రపక్షం ఏపీ సీఎం చంద్రబాబు బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ప్రచారానికి ఆహ్వానించారు. ఈనేపథ్యంలో నేడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లనున్నట్లు సమాచారం.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Show comments