NTV Telugu Site icon

CM Revanth Reddy: రేపు ఏపీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..!

Cm Revanthreddy

Cm Revanthreddy

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు ఏపీ కాంగ్రెస్ హాజరుకానుంది. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఇటీవల సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. నిన్న ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన సంగతి తెలిసిందే. విభజన సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారు.

Read also: Suryapet Principal: ప్రిన్సిపాల్‌ రూమ్‌లో బీరు బాటిళ్ల ఘటన.. మంత్రి ఉత్తమ్‌ సీరియస్‌..

కాగా ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాలని కోరారు. షర్మిల ఆహ్వానాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా హాజరవుతారని చెప్పారు. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లను షర్మిల సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి దేశంలోని పలువురు కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Ashada Masam 2024: ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తే అంతా సంతోషమే..!

Show comments