Site icon NTV Telugu

Cabinet Meeting: నేడే తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం

Cabinet

Cabinet

Cabinet Meeting: నేడు (మార్చ్ 19న) తెలంగాణ కేబినెట్ సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్ లో జరగనుంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సమావేశం అయ్యి.. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉదయం 11:14 నిమిషాలకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. అయితే, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also: Off The Record: అక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షుడికి అసమ్మతి నేతలు పగలే చుక్కలు..?

అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ప్రస్తుతం ఆసక్తి్కరంగా మారింది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఈసారి రూ. 3.20 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

Exit mobile version