Telangana Budget 2024: నేడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ సమావేశం కానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సొంత ఖాతా బడ్జెట్ గడువు జూలై నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే.
Read also: Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌పై కుట్ర.. రష్యన్ అరెస్ట్
ప్రతిపక్షాలతో కలిసి కేంద్రానికి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేంద్రంపై పోరాటానికి ప్రతిపక్షాలు తమతో కలిసి రావాలన్నారు. కాగా.. జూలై 26న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. జూలై 27న బడ్జెట్‌పై చర్చ జరగనుండగా.. జూలై 28 ఆదివారం కావడంతో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 29, 30 తేదీల్లో పలు బిల్లులు ప్రవేశపెట్టనుంది.జూలై 31న ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.ఆగస్టు 1,2 తేదీల్లో వివిధ బిల్లులను ప్రవేశపెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Read also: Babu Mohan: నువ్వెంతా? నీ బతుకెంత?.. ఆర్పీపై బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ రాష్ట్ర శాసనసభ బుధవారం తీర్మానం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్‌లో అవసరమైన సవరణలు చేయాలని శాసనసభ కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల యూనియన్. అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.
Storyboard: కేంద్ర బడ్జెట్ అందరిని నిరాశపరిచిందా..?