NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ఏపీకి రేవంత్‌రెడ్డి.. ప్రత్యేక విమానంలో విజయవాడకు..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం సీఎం, డిప్యూటీ సీఎం సహా అందరూ ప్రజాభవన్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి గాంధీభవన్‌కు చేరుకుని వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని సమీక్షించనున్నారు.

Read also: Shiva Stotram: సోమవారం నాడు ఈ స్తోత్రాలు వింటే శుభ ఫలితాలు చేకూరుతాయి.

అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్‌రెడ్డి విజయవాడకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరి చేరుకుని అక్కడ వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు. సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా విజయవాడ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్ కుమార్తె, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైఎస్ఆర్ అభిమానులను మళ్లీ ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలను టీపీసీసీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాభవన్, గాంధీభవన్‌లలో కార్యక్రమాలు జరిగాయి. ప్రజాభవన్‌లో వైఎస్‌ఆర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.
PM Modi : నేటి నుంచి మూడు రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన.. ఆస్ట్రియాతో కీలక చర్చలు జరిపే ఛాన్స్