NTV Telugu Site icon

Big Breaking: గ్రూప్‌ 1 పరీక్షలకు సుప్రీం కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

Supree,

Supree,

Big Breaking: గ్రూప్‌ 1 అభ్యర్థులను ఆందోళనకు సుప్రీం కోర్టు తెర దించింది. నేటి నుంచి గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీం చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంత వరకు వచ్చి ఇప్పుడు వాయిదా వేయడం మంచిది కాదని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇలా చేయడం వలన అభ్యర్థుల ఇంత వరకు ప్రిపేర్‌ అయిన సిలబస్‌ అంతా వ్యర్థం అవుతుందని తెలిపారు. ఇది కరెక్ట్‌ పద్దతి కాదని తెలిపింది. గ్రూప్‌ 1 పరీక్ష యదావిధిగా కొనసాగించాలని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌ 1 అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద రెండు గంటల ముందే వచ్చి కూర్చున్నారు. సుప్రీం నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో తెలియక సతమైన అభ్యర్థులకు తీపి కబురు ఇచ్చింది. దీంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద భారీగా చేరుకుని పరీక్ష రాసేందుకు సిద్దమయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
KTR: కేటీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు