Site icon NTV Telugu

BRS MLAs Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు.. తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Sc

Sc

BRS MLAs Defection Case: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలపై సుప్రీంకోర్టులో SLP వేసింది కారు పార్టీ. వాళ్లపై చర్యలకు టైం ఫ్రేం పెట్టాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తగిన సమయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది నిర్ణయం తీసుకోవాలని గతంలో రాష్ట్ర హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పిటిషన్ పై ఈరోజు (జనవరి 31) సుప్రీం బెంచ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ విచారణ జరిపారు.

Read Also: Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..

ఇక, పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్న స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అని బీఆర్ఎస్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. కనీసం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వలేదు అని తేల్చి చెప్పారు. హైకోర్టు రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. రీజనబుల్ టైం అంటే ఎంత సమయం కచ్చితంగా టైం ఫ్రేమ్ ఉండాలని బీఆర్ఎస్ తరపు అడ్వకేట్ తమ వాదనల్లో తెలిపారు.

Read Also: Anirudh : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..చిరు సినిమాకు అనిరుధ్ ఫిక్స్

అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి.. మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? అని సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ప్రశ్నించారు. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా? అని సెటైర్లు వేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అడిగిన సుప్రీం కోర్టు.. ఇక, స్పీకర్ను అడిగి నిర్ణయం చెపుతామన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. దీంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Exit mobile version