NTV Telugu Site icon

Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా..

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి గవర్నర్స్ బోర్డు చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు కంపెనీల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాస సి.రాజు ఈ యూనివర్సిటీ గవర్నర్ల బోర్డులో కో-చైర్మన్ హోదాలో సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాదిపాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ రంగాల్లో ప్రసిద్ధి చెందిన మహీంద్రా గ్రూప్‌కు ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అతను హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (ఆసియా-పసిఫిక్ అడ్వైజరీ బోర్డు), హార్వర్డ్ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ అడ్వైజరీ కమిటీ, ఆసియా బిజినెస్ కౌన్సిల్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థలలో సభ్యుడు.

Read also: Sri Lakshmi Stotram: రెండవ శ్రావణ శుక్రవారం నాడు ఈ స్తోత్రాలు వింటే అష్టైశ్వర్యాలు

పద్మభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమై స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించిన సంగతి తెలిసిందే. ఈ యూనివర్శిటీ చైర్మన్‌గా కూడా కొనసాగాలని కోరిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీని నెలకొల్పుతూ ఇటీవల అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రానున్న కాలంలో ఈ యూనివర్సిటీని విస్తరించి ప్రతి సంవత్సరం లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా భవనంలో ఈ వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతాయి.
Isro SSLV Rocket : నేడు SSLV రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో