Site icon NTV Telugu

Skill University Admission: నేటి నుండి స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్లు ప్రారంభం…

Skill University Admission

Skill University Admission

Skill University Admission: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా కొన్ని కోర్సులకు యూనివర్సిటీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ జారీచేసింది. తొలి విడతగా యూనివర్సిటీ ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తోంది.

Read also: Dasara Puja 2024: దసరా శుభ సమయం.. పూజా విధానం.. మంత్రం..

వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 29 లోగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ (https://yisu.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ తెలిపింది. నవంబర్ 4 వ తేదీ నుంచి ఈ కోర్సులు ప్రారంభమవుతాయి. తాత్కాలికంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ESCI) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) క్యాంపస్‌లలో ఈ కోర్సులను నిర్వహించనున్నారు.
Devaragattu Bunny Festival: నేడు దేవరగట్టు కర్రల సమరం.. ఏంటి ప్రత్యేకత..?

Exit mobile version